ఏంటి అమర్ దీప్ సూసైడ్ చేసుకోవాలనుకున్నాడా.. హ్యాపీగా సినిమాలు,సీరియల్స్, ప్రోగ్రామ్స్ అంటూ ఇండస్ట్రీలో హాయిగా గడిపేస్తున్న అమర్ దీప్ ఎందుకు సూసైడ్ చేసుకుంటారు అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అయితే ఇది నిజమో. ఎందుకంటే రూమర్ కాదు.అయితే ఈ విషయాన్ని స్వయంగా అమర్ దీప్ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. స్టార్ మా లో ప్రసారమయ్యే జానకి కలగనలేదు అనే సీరియల్ తో ఫేమస్ అయిపోయిన అమర్ దీప్ చౌదరి ఆ తర్వాత బిగ్బాస్ 7లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇందులో తన ఆటతో అందరిని మెప్పించి చివరికి రన్నరప్ గా నిలిచారు. ఆ తర్వాత కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే రెండు సీజన్లోలో పాల్గొన్నాడు.అంతేకాకుండా ఓ సినిమా కూడా చేస్తున్నారు.అయితే అలాంటి అమర్దీప్ చౌదరి తాజాగా కిస్సిక్ టాక్స్ షో కి వచ్చారు. 

ఈ షో కి సంబంధించిన తాజా ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక అందులో ఏముందంటే.. రాఖీ పండుగ సందర్భంగా అమర్దీప్ రావడంతో తమ్ముడు అంటూ వర్షా అమర్దీప్ ని ఆహ్వానించి రాఖీ కూడా కట్టింది. ఆ తర్వాత అమర్దీప్ మాట్లాడుతూ..నా లైఫ్ లోకి తేజస్విని రావడం చాలా అదృష్టంగా భావిస్తాను.అలాగే మా అమ్మ నా ఎదుగుదలకు చాలా కృషి చేసింది అంటూ చెప్పుకోచ్చారు. అయితే ఓవర్ థింకింగ్ చేస్తూ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు అని వర్ష ప్రశ్నించగా.. దీనికి నేనే పెద్ద ఉదాహరణ. ఎందుకంటే నేను చాలా ఓవర్ థింకింగ్ చేస్తాను. అయితే అలా ఎందుకు చేస్తానో కూడా నాకు తెలియదు.

ఎందుకంటే నా మెంటల్ స్టేటస్ అంతగా బాలేదు. అలాగే గతంలో నేను చేసిన పనులే కర్మ రూపంలో నన్ను బాధ పెడుతున్నాయి. గతంలో నేను ఎంతో మందిని బాధపెట్టాను. ప్రస్తుతం నా విషయంలో ఇది జరుగుతుంది. కర్మ రిటర్న్స్ అన్నట్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఉంటుంది.ఇక గతంలో నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి అనుకున్నాను. చాలామంది నాకు వెన్నుపోటు పొడిచారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అమర్దీప్ చౌదరి ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారు అనేది ఫుల్ ఎపిసోడ్ చూస్తే గాని తెలియదు.ఇక అమర్దీప్ రవితేజ కి పెద్ద ఫ్యాన్ అనే సంగతి మనకు తెలిసిందే.సింధూరం సినిమా నుండి ఆయనకి వీరాభిమానిని అయ్యానంటూ చెప్పుకొచ్చారు. మరి అమర్దీప్ చౌదరి చెప్పిన మరిన్ని ముచ్చట్లు తెలియాలంటే కచ్చితంగా ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందేm

మరింత సమాచారం తెలుసుకోండి: