సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన అనేక మంది వ్యక్తులతో పాటు అనేక మంది మామూలు వ్యక్తులు కూడా సినిమా ఇండస్ట్రీ కి నిర్మాతలు బ్యాక్ బోన్ లాంటివారు. వారు లేనట్లయితే ఇండస్ట్రీ అనేది ముందుకు సాగదు. అందుకు ప్రధాన కారణం సినిమా ఇండస్ట్రీలో ప్రధానమైన వ్యక్తులు అయినటువంటి నటి నటులు , టెక్నీషియన్స్ , దర్శకులు , నిర్మాతలు. వీరందరిలో ఒక సినిమా తీసిన తర్వాత నటీ నటులకు , టెక్నీషియన్స్ కి , దర్శకులకి ఎవరి రెమ్యూనరేషన్ వారికి వస్తూ ఉంటుంది. దానితో ఎవరూ కూడా పెద్దగా టెన్షన్ పడరు. కానీ నిర్మాత మాత్రం సినిమాను మొదలు పెట్టినప్పటి నుండి దానిపై డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాడు. సినిమా విడుదల అయ్యాక ఆ మూవీ బాగున్నట్లయితే అతనికి లాభాలు ఉంటాయి.

అలా మూవీ బాగుంది అనే టాక్ వచ్చినా కూడా కొన్ని సినిమాలు నష్టాలు చవిచూసినవి ఉంటాయి. దానితో నిర్మాత ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడు అని  , అలాంటి వ్యక్తి నష్టాల్లోకి వెళితే సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళ్లదు అని చాలా మంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో హీరోల రెమ్యూనరేషన్ వల్ల నిర్మాతకు పెద్ద మొత్తంలో నష్టాలు వస్తున్నాయి అని కూడా బలంగా అనేక మంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దానితో కొంత మంది హీరోలు నిర్మాతలను కాపాడడు కోసం ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మన తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యంగ్ హీరోలు అయినటువంటి వరుణ్ తేజ్ , నిఖిల్ , నితిన్  , విజయ్ దేవరకొండ , రామ్ పోతినేని వీరుతో పాటు గోపీచంద్ లాంటి కాస్త సీనియర్ హీరోలు కూడా తమ సినిమాలకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ను మొదట తీసుకొని ఆ తర్వాత సినిమా విడుదల ఈ ఆ మూవీ మంచి లాభాలను అందుకున్నట్లయితే అందులో లాభాలను తీసుకునే విధంగా ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నిర్మాతకు చాలా సహాయపడుతుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: