టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. ఈమె చాలా కాలం క్రితం నేటిగా కెరియర్ను మొదలు పెట్టింది. ఈమె మొదటగా నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ అనే మూవీతో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా కూడా ఈ సినిమాలో అనుష్క తన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చాలా తక్కువ కాలంలోనే ఈమె ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

కెరియర్ ప్రారంభంలో అనేక సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులకు ఫుల్ ట్రేట్ ను అందించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో మాత్రం గ్లామర్ షో కు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం వైవిధ్యమైన సినిమాల్లో , పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తుంది. తాజాగా ఈమె క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఘాటి అనే సినిమాలో నటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న కుర్ర హీరోలలో తేజ సజ్జ ఒకరు.

ఈయన చైల్డ్ ఆర్టిస్టుగా కెరియర్ను మొదలు పెట్టి చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. గత కొంత కాలంగా ఈయన సినిమాల్లో హీరోగా నటిస్తూ వచ్చాడు. తేజ హీరోగా నటించిన సినిమాల సంఖ్య తక్కువే అయినప్పటికీ విజయాల శాతం మాత్రం అద్భుతంగా ఉంది. ప్రస్తుతం తేజ "మిరాయ్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కూడా చాలా కాలం క్రితమే ప్రకటించారు. దీనితో అనుష్క నటించిన ఘాటీ మూవీ కి మంచి టాక్ వచ్చినట్లయితే మిరాయ్ సినిమాపై దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని, ఆ సినిమా కలెక్షన్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: