
అయితే జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలు సాధిస్తూనే రామ్ చరణ్ కంటే ఎక్కువ సినిమాలలో నటిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతుండగా ఈ కామెంట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యకమవుతున్నాయి. ప్రతి స్టార్ హీరో కెరీర్ లో జయాపజయాలు కామన్ అని అంత మాత్రాన రామ్ చరణ్ ను తారక్ తో పోలుస్తూ మరీ నెగిటివ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రామ్ చరణ్ కు యాక్టింగ్ రాదంటూ గతంలో విమర్శలు చేశారని ఆ సమయంలో రంగస్థలం సినిమాతో చరణ్ తానేంటో ప్రూవ్ చేసుకున్నారని ఇప్పుడు కూడా విమర్శలు చేస్తున్న వాళ్ళకు పెద్ది సినిమాతో జవాబు దొరుకుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
2026 సంవత్సరంలో రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా మూడు బ్యానర్లు చరణ్ రేంజ్ ను ఏ మాత్రం పెంచుతాయో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ కథల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.