
ముఖ్యంగా డ్రగ్స్ మాఫియాపై ఆధారపడి ఉండే సన్నివేశాలను ఇండోనేషియాలో చిత్రీకరించనున్నారు. అక్కడి రియల్ లొకేషన్స్‌లోనే పెద్ద యాక్షన్ బ్లాక్స్ ప్లాన్ అయ్యాయని సమాచారం. ప్రభాస్ ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ కాప్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇండోనేషియా షెడ్యూల్‌లో ఆయనకు సంబంధించిన ఇంపాక్ట్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్. కథలో విదేశీ పోలీస్ మిషన్ పూర్తయ్యాక, కథ ఇండియాకు షిఫ్ట్ అవుతుంది. ఆ తరువాతి భాగాన్ని హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో షూట్ చేస్తారు. ఈ షెడ్యూల్ వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలైనప్పటికీ, ప్రభాస్ మాత్రం నవంబర్ నుంచి సెట్స్‌లో అడుగుపెడతారని తెలిసింది. కారణం – ప్రస్తుతం ఆయన రాజాసాబ్ మరియు పౌజీ సినిమాలతో బిజీగా ఉండటమే.
రాజాసాబ్ షూటింగ్ క్లైమాక్స్ దశలో ఉండగా, ఆయన పార్ట్ పూర్తయింది. కేవలం డబ్బింగ్ మిగిలి ఉంది. పౌజీ మాత్రం ఫుల్ స్పీడ్‌లో కొనసాగుతూ, నవంబర్ కల్లా కంప్లీట్ అవుతుంది. అప్పటివరకు వంగా, స్పిరిట్లోని ఇతర ప్రధాన పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే, కథ మొత్తం ఆయన చుట్టూ తిరిగేలా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ భామ త్రిప్తీ డిమ్రీ హీరోయిన్‌గా నటించనుంది. ప్రభాస్ – సాందీప్ రెడ్డి వంగా కాంబో అంటేనే అంచనాలు ఆకాశమే హద్దు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యనిమల్ లాంటి యూనిక్ యాక్షన్ డ్రామాల తర్వాత, వంగా మాస్ మరియు ఇంటెన్స్ పోలీస్ డ్రామా చేయడం అంటే పాన్-ఇండియా ఆడియన్స్‌కి భారీ ఎక్సైట్మెంట్. అదీ ప్రభాస్ లాంటి స్టార్ పవర్‌తో వస్తే? బాక్స్ ఆఫీస్ దద్దరిల్లడం ఖాయం.