మూడు గంటలపాటు కూలి చూసిన తర్వాత ప్రేక్షకుల మైండ్‌లో ఒక్క డౌట్ మాత్రమే మిగిలింది – “ఇందుకేనా ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్?”.లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో వయోలెన్స్, ఫైట్లు, హత్యలు ఉన్నాయే కానీ అవి షాకింగ్ లెవెల్‌లో లేవు. విలన్ పాత్రలో నాగార్జునని డార్క్ షేడ్‌లో చూపించినా, ఆయన చేసే హత్యలు కళ్ళు మూసుకునేలా ఉండవు. సౌభిన్ సాహిర్ చేసిన హింస మాత్రం కాస్త హార్ష్‌గా ఉన్నా, చిన్న పిల్లలు భయపడేంత స్థాయికి పోలేదు. నిజానికి యానిమల్, పుష్ప 2లో ఉన్న యాక్షన్, రక్తసిక్త సన్నివేశాలు కూలి కంటే చాలా ఎక్కువ.
 

కొన్ని బూతు డైలాగులు, రెండు మూడు హింసాత్మక విజువల్స్ మినహా పెద్దగా అడల్ట్ కంటెంట్ లేదు. అందుకే చాలామంది ఈ సినిమాకు యు/ఏ ఇచ్చినా సరిపోతుందని అభిప్రాయపడ్డారు. కానీ సెన్సార్ బోర్డు కోరిన కట్స్‌కు లోకేష్ కాంప్రమైజ్ కాలేదు. తాను ఫైనల్ చేసిన వెర్షన్‌ను  రీలీజ్ చేయాలన్న పట్టుదల చూపించాడు. నిర్మాత కళానిధి మారన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫలితంగా, కూలి “అడల్ట్స్ ఓన్లీ” ట్యాగ్‌తో థియేటర్లలోకి వచ్చింది. ఈ నిర్ణయం వల్ల 18 ఏళ్ల లోపు వాళ్లను మల్టీప్లెక్సుల్లోకి అనుమతించడం లేదు. రిలీజ్‌కి ముందే సోషల్ మీడియాలో ఈ ప్రకటన ఇచ్చినా, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతోనే థియేటర్లకు రావడం గమనార్హం.

 

ఆన్‌లైన్ బుకింగ్స్ వల్ల ఎగ్జిబిటర్లకు వద్దని చెప్పే అవకాశం లేకుండా పోయింది. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం వేరే పాయింట్ చెబుతున్నారు – “సెన్సార్ చెప్పిన కట్స్, మ్యూట్స్ చేసి రీ-సెన్సార్ చేయించుకుంటే యు/ఏ వస్తుంది, కలెక్షన్లు ఇంకా పెరుగుతాయి.” కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమే. ఎందుకంటే సినిమాకి కలెక్షన్లు ఇప్పటికే బాగా వస్తున్నాయి, వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్‌గా ఉంది. లోకేష్ కనగరాజ్ పంతం, రజనీ మద్దతు, మరియు సెన్సార్ “ఏ” స్టాంప్ – ఇవన్నీ కూలి చుట్టూ మరింత హైప్ క్రియేట్ చేశాయి. కంటెంట్ కంటే ఈ వివాదం సినిమాకి మాస్ పుల్‌ను పెంచిందనే అభిప్రాయం కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: