
ఈ సినిమా నిన్న థియేటర్స్‌లో విడుదలై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. విడుదలైన అన్ని చోట్లా కూలీ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వినిపించింది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో అని ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఎక్స్పెక్ట్ చేశారు. అయితే, ఫ్యాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ రికార్డులు ఈ సినిమా సృష్టించినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఇది నిజమైతే, తమిళంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో "కూలీ" మొదటి స్థానంలో నిలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ మరికొద్ది గంటల్లోనే చిత్ర బృందం దీనిపై అధికారికంగా స్పందించబోతున్నట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది.
ఇంతకుముందు ఈ రికార్డు విజయ్ దళపతి పేరున ఉండేది. విజయ్ దళపతి – త్రిష నటించిన లియో సినిమా మొదటి రోజు 148 కోట్లు వసూలు చేసింది. అయితే, ఆ రికార్డును చెరిపేస్తూ, రజనీకాంత్ తన కూలీ సినిమాతో మొదటి రోజు 170 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇది నిజంగా సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పలి. ఈ ఏజ్ లో కూడా రజనీకాంత్ ఇలాంటి రికార్డ్స్ కొల్లగొడుతున్నారు అంటే మాత్రం దానికి కారణం ఆయన కి సినిమా ల పై ఉండే ఇంట్రెస్ట్ అలాగే ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పాలి..!