కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి కేవలం తమిళ సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు. రజనీ కాంత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ ఆగస్టు 15 వ తేదీతో 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇలా రజినీ కాంత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఆయనకు అనేక మంది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రజనీ కాంత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా రజనీ కాంత్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా రజనీ కాంత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో అతనికి శుభాకాంక్షలు తెలియజేశాడు. దానితో రజనీ కాంత్ కూడా చంద్రబాబు నాయుడు తెలిపిన శుభాకాంక్షలు పై రియాక్ట్ అయ్యాడు. 

తాజాగా చంద్రబాబు చేసిన పోస్టుకు రజనీ కాంత్ స్పందిస్తూ ... మీ మాటలు నా హృదయాన్ని తాకాయి. అలాగే నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. మీ సందేశం నా హృదయాన్ని హత్తుకుంది. మీలాంటి గొప్ప వాళ్ళ స్నేహం , ప్రేమ వల్ల నేను సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయిలో రాణిస్తాను అని రజనీ కాంత్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే రజినీ కాంత్ తాజాగా కూలీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు 14 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: