రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏ పోస్ట్ పెట్టినా కొన్ని సెకన్లలోనే ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన రష్మిక మందన్న ప్రస్తుతం అనేక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. మైసా సినిమా తర్వాత మరో బిగ్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం రష్మిక ఎంతో కష్టపడుతోంది .. అసలు రష్మిక ఈ స్థాయికి ఎదగడానికి బిగ్ సక్సెస్ అందించిన మూవీ "గీత గోవిందం".
 

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా, విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ అప్పట్లో సినిమాకే మరో స్థాయిని ఇచ్చింది. ఆగస్టు 15, 2018న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా నిన్నటితో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రష్మికమధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. “ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు నా దగ్గర ఇంకా ఉన్నాయి. నమ్మలేకపోతున్నాను… ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడు సంవత్సరాలు అయిందా? ఈ ఏడు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో నాకు అస్సలు అర్థం కావడం లేదు” అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.



ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు రష్మిక–విజయ్ లవ్ మ్యాటర్‌ను మరోసారి చర్చించుకుంటున్నారు. “మీ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాం”, “ఫోటోలు చూస్తుంటే చాలా బాగున్నాయి”, “మీ ఇద్దరి లవ్ స్టోరీ ‘గీత గోవిందం’లోనే మొదలైంది కదా” అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న రొమాంటిక్ పిక్చర్స్ వైరల్‌గా మారాయి. వీళ్ళిద్దరు మరోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అంటూ తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!



మరింత సమాచారం తెలుసుకోండి: