బాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి హీరోయిన్లలో  కరీనాకపూర్  కూడా ఒకరు.. ఆమెను హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఎంతో మంది దర్శక, నిర్మాతలు వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి ఈ హీరోయిన్ ను ఒక స్టార్ డైరెక్టర్ అవమానపరిచారట. ఆమెను సినిమాలో తీసుకొని టెస్ట్ షూట్ కూడా పూర్తి చేసి ఆ తర్వాత రిజెక్ట్ చేశారట. దీంతో కోపానికి వచ్చినటువంటి కరీనాకపూర్డైరెక్టర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి కరీనాకపూర్ ని అవమానించినా ఆ డైరెక్టర్ ఎవరు ... ఆమెను ఏ సినిమాలో తీసుకొని  పక్కన పెట్టారు. మరి కరీనా కపూర్ ని తీసుకొని టెస్ట్ షూట్ చేసి రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది అనే వివరాలు చూద్దాం..

కరీనాకపూర్ ని అవమానించిన డైరెక్టర్ ఎవరో కాదు సంజలీలా బన్సాలి.2002లో  సంజయ్ లీలా డైరెక్షన్ లో షారుక్ ఖాన్, ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో వచ్చినటువంటి చిత్రం దేవదాస్. ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. అయితే ఈ చిత్రంలో పారో (పార్వతి)గా ఐశ్వర్యరాయ్, చంద్రముఖిగా మాధురి దీక్షిత్ నటించారు. అయితే ఇందులో పారో రోల్ కోసం ముందుగా కరీనాకపూర్ ని ఓకే చేశారట బన్సాలి. కానీ చివరి సమయం వచ్చేసరికి  ఆమెను కాదని ఐశ్వర్యరాయ్ ని ఓకే చేశారట. దీంతో తీవ్రంగా బాధపడిపోయిన కరీనాకపూర్ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సంజయ్ లీలా బన్సాలి  ఒక అయోమయ దర్శకుడని,  ఇచ్చిన మాట మీద అస్సలు నిలబడడని, నీతి నిజాయితీ అనేది ఆయన దగ్గర లేవని అన్నది.

నేను ఇకనుంచి ఆయన డైరెక్షన్ లో ఒక్క సినిమా కూడా చేయను. నాకు ఎన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చినా నాకు అవకాశాలు లేకపోయినా ఆయన డైరెక్షన్లో సినిమాలు చేయనని గట్టిగా చెప్పేసింది.   దేవదాసు చిత్రంలో నేను పారో పాత్రకు బాగా సెట్ అవుతానని చెప్పి, నాతో సైన్ చేయించుకొని ఫోటోషూట్ కూడా పూర్తి చేసి చివరికి నన్ను కాదని  అవకాశం వేరే హీరోయిన్ కు ఇచ్చాడని,  అంతటి అమాయకపు డైరెక్టర్ ను నేను ఎక్కడా చూడలేదని ఆమె నిందించింది. అయితే అప్పట్లో కరీనాకపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: