స్టార్ సెలబ్రెటీలకు అవమానాలు జరగడం అనేది కొత్తగా వింటున్న మాట కాదు. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు బయటికి వెళ్లిన సమయంలో చాలాసార్లు సెక్యూరిటీ ద్వారా ఇతరుల ద్వారా అవమానించబడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా తాజాగా శృతిహాసన్ వంతు అయింది. శృతిహాసన్ తాజాగా థియేటర్ కి వెళ్ళగా ఆమెను లోపలికి వెళ్లకుండా అక్కడే ఆపేశారు. లోపలికి వెళ్లడానికి వీల్లేదు అంటూ సెక్యూరిటీ చేసిన పనికి శృతిహాసన్ ఇచ్చిన ఆన్సర్ కి ఆమె ఫ్రెండ్స్ అందరూ బిగ్గరగా నవ్వేశారు.మరి ఇంతకీ శృతిహాసన్ ని సెక్యూరిటీ ఎందుకు ఆపేసారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. శృతిహాసన్ కీ రోల్ పోషించిన కూలి మూవీ రీసెంట్ గా విడుదలైన సంగతి మనకు తెలిసిందే. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో నాగార్జున విలన్ గా.. ఉపేంద్ర,శృతిహాసన్ వంటి వాళ్లు కీ రోల్స్ పోషించారు. అయితే తమ సినిమాలు విడుదలయితే చాలామంది సెలెబ్రెటీలు ఎక్కడో ఓ థియేటర్లో సినిమాలు చూసి అభిమానుల మధ్య ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

అలా శృతిహాసన్ కూడా విడుదలైన తన కూలి మూవీ ని చూడాలని థియేటర్ కు వెళ్ళింది. కానీ థియేటర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ మాత్రం శృతిహాసన్ ని లోపలికి వెళ్ళనివ్వకుండా కారు అక్కడే ఆపేసింది.అయితే శృతిహాసన్ తన ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకు వెళ్లాలనుకుంది. కానీ సెక్యూరిటీ చేసిన పనికి ఆమె పరువు పోయినట్టు అయింది. దీంతో నేను ఈ సినిమాలో చేశాను.ఇందులో హీరోయినయ్యా బాబు అని సెక్యూరిటీతో చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఇక శృతిహాసన్ చెప్పిన మాటలకి ఆమె ఫ్రెండ్స్ అందరూ నవ్వేసారు. దాంతో శృతిహాసన్ పరువు పోయినంత పని అయింది.అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు స్నేహితుల ముందే శృతిహాసన్ పరువు పోయిందిగా అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే మరి కొంత మందేమో సెక్యూరిటీ తన పని తాను చేశాడు. 

ఎవరైతే ఏంటి తన డ్యూటీ తాను చేశాడు అంటూ మరి కొంత మంది కామెంట్లు పెడుతున్నారు. ఇక శృతిహాసన్ కి మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలకు అవమానం జరుగుతుంది. ఇక రీసెంట్గా ఎయిర్పోర్ట్ లో ఉండే సెక్యూరిటీ అల్లు అర్జున్ మొహానికి మాస్క్ పెట్టుకొని ఉంటే కచ్చితంగా తీయాల్సిందే అని పట్టుబడ్డారు. ఇక ఆ పక్కనే ఉన్న వ్యక్తి ఈయన అల్లు అర్జున్ అయ్యా.. పుష్పరాజ్ అని చెప్పినా కూడా వినకుండా లేదు లేదు మాస్క్ తీయాల్సిందే అంటూ పట్టుబట్టాడు.దాంతో చేసేదేమీ లేక అల్లు అర్జున్ మాస్కు తీసి చూపించి వెళ్లిపోయాడు. ఇక ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో పుష్ప రాజ్ ని గుర్తుపట్టని సెక్యూరిటీ అల్లుఅర్జున్ పరువు తీసారుగా అని మాట్లాడుకున్నారు.కానీ చాలామంది మాత్రం సెక్యూరిటీ తన పని తాను చేశాడని మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: