మాస్ మహారాజ్ రవితేజ రేస్ ఆగడం లేదు. జయాపజయాల‌తో ఎలాంటి సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఆయన కెరీర్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఇటీవ‌ల భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, అనుకోని కారణాల వలన వాయిదా పడిందని సమాచారం. కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక మరోవైపు రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరినాటికి పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మాస్ మహారాజ్ లైన్‌లో రెండు భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయట.

ఇక అందులో ఒకటి శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కబోయే యాక్షన్ థ్రిల్లర్. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి హిట్ సినిమాలు ఇచ్చిన శివ నిర్వాణ, ‘ఖుషి’ ఫ్లాప్‌తో కొంత వెనుకబడ్డారు. కానీ తన తాజా కథతో రవితేజను ఆకట్టుకొని, మైత్రీ మూవీ మేకర్స్‌లో ఈ ప్రాజెక్టును ఫైనల్ చేసుకున్నారు. వ‌చ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాదు, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ (కలర్ ఫోటో ఫేమ్) తో కూడా రవితేజ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుండగా, వచ్చే ఏడాది మధ్యలో సెట్స్ పైకి వెళ్లనుంది. రవితేజ - సందీప్ రాజ్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే న్యూస్‌తో అభిమానుల్లో మంచి బజ్ ఏర్పడింది.

అంటే, 2025లో రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ మాస్ ఆడియెన్స్‌కి ట్రీట్ ఇవ్వనున్నారన్నమాట. కిషోర్ తిరుమల సినిమా, శివ నిర్వాణ ప్రాజెక్ట్, సందీప్ రాజ్ డైరెక్షన్‌లో మూవీ… ఇలా లైన్‌లో మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి. మాస్ జాతర విడుదల తర్వాత రవితేజ కెరీర్‌లో మరో కొత్త పీక్స్ రాబోతున్నాయని టాలీవుడ్ టాక్. మొత్తానికి రవితేజ ఎప్పటిలాగే వర్క్ హోలిక్ మోడ్‌లోకి వెళ్లి, ఓన్లీ మాస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే తన పంథాను కొనసాగిస్తున్నారన్నమాట. ఆయన కొత్త సినిమాలు ఆడియెన్స్ అంచనాలను ఎంతవరకు నెరవేర్చుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: