రాహుల్ సిప్లగంజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ సింగర్. ముఖ్యంగా ఆయన పాడే పాటలు అభిమానులను బాగా అలరిస్తుంటాయి. ఎలాంటి పాటలు అయినా సరే అవలీలగా పాడి జనాలను మెప్పించే రాహుల్ సిప్లగంజ్ లైమ్‌లైట్‌లోకి రావడం మాత్రం బిగ్ బాస్ షో ద్వారానే అని చెప్పాలి. బిగ్ బాస్ షోలో వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్‌గా నిలిచి, ఆ తర్వాత ట్రోఫీ విన్నర్‌గా సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు మరో కంటెస్టెంట్ పునర్నవి భూపాలంతో బాగా మింగిల్ అయిన రాహుల్, ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఆమె కారణంగా వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో "నాటు నాటు" సాంగ్ పాడి, ఏకంగా ఆ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చేలా చేశాడు. దీంతో ఒక్కసారిగా గ్లోబల్ స్థాయిలో ఆయన పేరు మారుమ్రోగిపోయింది.


ఆ తర్వాత వచ్చిన ఆఫర్లతో తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లిన రాహుల్ సిప్లగంజ్, ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. రాహుల్ సిప్లగంజ్ నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పటివరకు దీనిపై ఆయన అధికారికంగా స్పందించకపోయినా, ఎంగేజ్మెంట్ పిక్స్ మాత్రం బయటకు వచ్చేశాయి. ఎంగేజ్మెంట్‌కి పలువురు స్టార్స్, అలాగే ఫ్రెండ్స్ హాజరయ్యారు. వారు తీసిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త వైరల్ అవుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సింగర్‌గా ఉన్న రాహుల్, ఇప్పుడు సింగిల్ లైఫ్‌కు బైబై చెప్పి మ్యారేడ్ లైఫ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు.


అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఆయన ప్రాణంగా ప్రేమించిన గర్ల్‌ఫ్రెండ్ హరిణ్యా రెడ్డి. ఆగస్టు 17న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా వీరి నిశ్చితార్థం జరిగింది. కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు, చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఫోటోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హరిణ్య రెడ్డి ఎవరు? ఆమెకు రాహుల్‌తో ఎలా పరిచయం ఏర్పడింది? అనే విషయాలు కూడా ఇంట్రెస్టింగ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు, సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం హరిణ్య రెడ్డి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరోకి మరదలు వరుస అవుతుందట. ఆ హీరో భార్యకు హరిణ్యా రెడ్డి దూరపు కజిన్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిశ్చితార్థానికి ఆ హీరో రాలేకపోయినా, పెళ్లికి మాత్రం కచ్చితంగా వస్తాడని సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుకుంటున్నారు. దీంతో రాహుల్ సిప్లగంజ్ కూడా స్టార్ ఫ్యామిలీకి అల్లుడవుతున్నాడనే హడావుడి టాలీవుడ్‌లో మొదలైంది. అభిమానులు ఓ  రేంజ్‌లో సంబరాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: