టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నట వారసులలో ఒకరు అయినటువంటి అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అఖిల్ టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ అనే మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది. ఆ తర్వాత కూడా అఖిల్ నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అఖిల్ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ద్వారా మంచి విజయం దక్కింది.

ఆఖరుగా అఖిల్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే పవర్ఫుల్ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా అఖిల్ కు నిరాశనే మిగిల్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అఖిల్ "లెనిన్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ విడుదల చేసిన సమయంలో ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా నుండి శ్రీ లీల తప్పుకుంది. దానితో ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా ఫిక్స్ చేసుకున్నారు.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ఐటమ్ సాంగ్ లో ఒక అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మను తీసుకోవాలి అనే ఉద్దేశంతో అనేక మంది హీరోయిన్లను మూవీ బృందం వారు  పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ను మంగ్లీ తో పాడించాలి అని కూడా మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: