
సమంత తన 15 ఏళ్ల సినీ కెరియర్ లో ఎన్నో పాత్రలలో నటించిందని గ్రాజియా వెల్లడించింది. ఈ ఫోటోలలో సమంత చాలా అందంగా కనిపించడమే కాకుండా 22 క్యారెట్ల బంగారం ఉంగరాన్ని, గాజులను ఒక హారంతో సమంత ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాలలో వైరల్ గా మారుతున్నాయి. సమంత ఈ ఫోటోలలో చాలా స్టైలిష్ గా కనిపించడమే కాకుండా చాలా విభిన్నంగా కనిపిస్తోంది సమంత లుక్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఒక్కో ఫోటోలో తన విభిన్నమైన అందాలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సమంత ఒక్క ఫోటోలో ఏకంగా తన నడుము అందాలను హైలెట్ చేస్తూ, బికినీ అందాలతో మరింత స్టైలిష్ గా కనిపిస్తోంది. మొత్తానికి ఈ సమంత సరికొత్త లుక్కుని చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రోజురోజుకి సమంత గ్లామర్ విషయంలో హద్దులు దాటేస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో సీటాడేల్ అంటూ ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సక్సెస్ కాలేకపోయింది. శుభం సినిమాతో నిర్మాతగా మారి సక్సెస్ అందుకున్న సమంత మరొకపక్క వెబ్ సిరీస్ సినిమాలలో నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలాగే రెండో వివాహం గురించి పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.