
ఈ క్రమంలోనే బాలకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పద్మజ మృతదేహాన్ని చూసి, “ఆమె నాకు అమ్మ తర్వాత అమ్మలాంటిది” అంటూ ఎమోషనల్ అయ్యారు. బాలయ్యను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మొదటి నుంచే పద్మజ గారు అంటే బాలకృష్ణకు చాలా గౌరవం. ఒక తల్లికి ఇచ్చే గౌరవమే ఆయన ఇచ్చేవారు. అంతేకాదు, తాను స్కూల్‌కి వెళ్లే సమయంలో కూడా తన బాగోగులు అమ్మలాగే దగ్గరుండి చూసుకునేదని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. “అమ్మ లేని లోటు నాకు ఎప్పుడూ తెలియనివ్వలేదు” అంటూ బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు ఆయనను ఓదార్చినా ఆయనను కంట్రోల్ చేయలేకపోయారు. ఎప్పుడూ సరదాగా ఉండే బాలయ్య ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అభిమానులు కూడా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ పెద్ద కోడలు పద్మజ ఎప్పుడూ ఇంటి బాధ్యతలను చక్కగా నెరవేర్చేవారు. ఏ ఫంక్షన్ అయినా పెద్దదిక్కులా ఉండి నందమూరి పరువు కాపాడుతూ వచ్చారు. ఈ విషయాన్ని చాలామంది గుర్తు చేసుకుంటూ, “పద్మజ నందమూరి కుటుంబానికి పెద్దదిక్కు. అలాంటి ఆమెను కోల్పోవడం చాలా బాధాకరం” అని భావోద్వేగంతో గుర్తు చేసుకుంటున్నారు..!