సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పులు మొదలయ్యాయి. ముఖ్యంగా, ఒక సినిమాకి సంబంధించిన అధికారిక అప్డేట్ రాకముందే ఆ సినిమాకి సంబంధించిన సీన్స్, పాటలు సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి. తాజాగా "ఫౌజి" సినిమా కూడా అలాంటి సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న  ఈ సినిమాను హను రాఘవపూడి చాలా ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహిస్తున్నారు. చాలా స్పెషల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులను కొత్తగా అలరిస్తుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.


అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఒక ఎక్స్‌క్లూజివ్ సెన్సేషనల్ పిక్  సోషల్ మీడియాలో లీకై వైరల్ అయింది. ఆ లుక్ చూసిన అభిమానులు "డార్లింగ్ వింటేజ్ స్టైల్లో కనిపిస్తున్నాడు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది అభిమానులు చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ను ఇలాంటి లుక్‌లో చూడటం సర్‌ప్రైజ్‌గా అనిపించిందని  కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో మూవీ మేకర్స్ మాత్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. “ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడుతున్నాం. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ కొంతమంది అత్యుత్సాహంతో సెట్స్‌ నుండి ఫోటోలు లీక్ చేస్తున్నారు. మేము అందరికీ అద్భుతమైన అనుభవం ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. ఇలాంటి లీకులు మా టీం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. లీక్ ఫోటోలు షేర్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లపై చర్యలు తీసుకోవడమే కాక, అవసరమైతే సైబర్ క్రైమ్ కింద కేసులు నమోదు చేస్తాం” అని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు.



అయినా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం లీకైన లుక్‌పై ఫుల్ హ్యాపీగా ఉన్నారు. “ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ కన్ఫర్మ్” అంటూ ధీమాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో షోషల్ మీడియా ఇంఫ్లుయెన్సర్ ఇమ్మాన్వీ నటిస్తుంది. ఈ సినిమా లో ఇప్పటి వరకు మనం ఎన్నడు చూడని ప్రభాస్ ని చూడబోతున్నం అంటూ చాలా క్లీయర్ గా తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ ఊపు మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు..!



మరింత సమాచారం తెలుసుకోండి: