తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటులలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. రవితేజ కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సినిమాలో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. హీరోగా అవకాశాలను దక్కించుకున్నాక  రవితేజ మంచి విజయాలను అందుకుంటు తన నటనతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో మెప్పించాడు. దానితో ఆయనకు అంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.

ఇది ఇలా ఉంటే రవితేజ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈయన నటించిన చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. రవితేజకు ఆఖరి ఉదయం ధమాకా మూవీతో వచ్చింది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. రవితేజ ఆఖరుగా మిస్టర్ బచ్చన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ని సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమా విడుదల తేదీ పోస్ట్ పోన్ అయ్యింది అని ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇక ప్రస్తుతం ఈ సినిమా ఆగస్టు 27 వ తేదీన విడుదల కావడం కష్టం , ఈ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేసి ఈ మూవీ బృందం ఈ మూవీ ని సెప్టెంబర్ 12 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనకు వచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాను ఆగస్టు 27 వ తేదీన విడుదల చేస్తారా ..? లేక సెప్టెంబర్ 12 వ తేదీన విడుదల చేస్తారా ..? లేక మరేదైనా తేదీన విడుదల చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt