సాధారణంగా ఎవరి పుట్టినరోజయినా ముందుగా విష్ చేసేది భర్త అయితే భార్య, భార్య అయితే భర్త. పెళ్లి తర్వాత ఎక్కువగా ఇదే చూస్తుంటాం. అర్థరాత్రి 12 గంటలకు కచ్చితంగా విషెస్ చెబుతూ ఉంటారు. కొంతమంది రాత్రంతా మేల్కొని తమ ప్రియమైన భర్తకి లేదా భార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. మనలో చాలామంది కూడా మన పార్ట్నర్ విషయంలో ఇలాగే ఆలోచిస్తూ విష్ చేస్తాం. మన స్తోమతకు తగ్గట్టు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాం. గిఫ్ట్ ఇవ్వలేని వారు కూడా ఒక రోజా పువ్వు ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. గిఫ్ట్ అనేది ఇచ్చే వస్తువు విలువ మీద కాదు, ఇచ్చే మనసు మీద ఆధారపడి ఉంటుంది అని అందరికీ తెలుసు.


ఇప్పుడు చిరంజీవికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, నెక్స్ట్ సినిమాల అప్డేట్లు, హ్యాష్‌ట్యాగ్‌లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. చిరంజీవి పుట్టినరోజును ఆయనకంటే ఎక్కువగా మెగా ఫ్యాన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. మెగాస్టార్ పేరుతో బ్లడ్ క్యాంపులు, అన్నదానాలు చేస్తూ “అయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి” అని కోరుకుంటారు. ఇలాంటి సందర్భంలో అసలు చిరంజీవికి మొదటగా బర్త్‌డే విషెస్ చెప్పేది ఎవరు? అనేది చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. చిరంజీవి పెద్ద స్టార్ కావడంతో ఆయన ఇంట్లో చాలామంది ఉంటారు—కూతురు, అల్లుళ్లు, కొడుకు, కోడలు, తమ్ముళ్లు. మరి ఆయనకి మొదటగా విషెస్ చెప్పేది ఎవరు అనేది అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది.



ఒక సందర్భంలో ఈ విషయాన్ని బయటపెట్టారు. అందరూ “మొదటగా విషెస్ చేసేది సురేఖ గారే” అనుకుంటారు. ఎందుకంటే భార్య, జీవిత భాగస్వామి ఎల్లప్పుడూ పక్కనే ఉంటారు కాబట్టి పుట్టినరోజు రాత్రి అర్థరాత్రి 12 గంటలకు ఆమెనే విషెస్ చేస్తుందనుకుంటారు. కానీ అది కాదు. చిరంజీవికి సురేఖ కన్నా ముందుగా విషెస్ చేసేది ఆయన తల్లి అంజనమ్మ. ఇది నిన్న మొన్న మొదలైన విషయం కాదు, ఆయన పుట్టినప్పటి నుంచి అంజనమ్మ ఇదే చేస్తూ వస్తున్నారు. కేవలం చిరంజీవి విషయంలోనే కాదు, నాగబాబు, పవన్ కల్యాణ్ విషయంలో కూడా అంతే. అంజనమ్మ సరిగ్గా రాత్రి 12 గంటల సమయంలో అందుబాటులో ఉంటే నేరుగా, లేకపోతే ఫోన్ ద్వారా అయినా తన పిల్లలకు ముందుగా విషెస్ చేస్తారు. చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నందున ఆయన దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా విషెస్ చేసి ఆశీర్వదిస్తారు. అంతేకాదు, ఆయన పుట్టినరోజున అంజనమ్మ స్వయంగా తన చేతులతో వండి తినిపిస్తారు. ఇంతకంటే చిరంజీవికి ఏమి కావాలి? ప్రాణంగా ప్రేమించే కుటుంబ సభ్యులు, ప్రాణంగా ఆరాధించే అభిమానులు .. ఇవన్నీ ఉండటం వల్ల చిరంజీవి నిజంగా చాలా లక్కీ.

మరింత సమాచారం తెలుసుకోండి: