మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్లో ఎన్నో మెట్లు ఎక్కుతూ ఇండస్ట్రీకి పెద్దన్నగా మారారు.అయితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అందరిలాగే చిరంజీవి కూడా చాలా ఇబ్బందులతో పాటు అవమానాలు కూడా పడ్డారు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో ఆయనను చాలా చిన్నచూపు చూశారు.కానీ తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించి చివరికి మెగాస్టార్ గా మారారు. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆయన గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. అదేంటంటే చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్నో బిరుదులు అవార్డులు అందుకున్నారు.కానీ ఆయన జీవితంలో ఇప్పటివరకు తీరని ఒక కోరిక ఉందట. నా లైఫ్ లో అదే ఒక లోటు అంటూ ప్రతిసారి చిరంజీవి చెప్పుకొస్తున్నారు. మరి ఇంతకీ చిరంజీవికి ఉన్న లోటు ఏంటి.. అది ఎప్పటికైనా నెరవేరుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఏకైక లోటు ఏంటంటే ఎమోషనల్ పాత్రలు.. చిరంజీవి తన సినీ కెరియర్ లో ఎన్నో పాత్రలు పోషించారు. కానీ ఎమోషనల్ పాత్రలు మాత్రం చాలా తక్కువ చేశారట. అయితే తన జీవితంలో ఉన్న ఏకైక లోటు ఇదేనని,ఎప్పటికైనా ఎప్పటికీ గుర్తుండిపోయే ఎమోషనల్ పాత్రల్లో నటించాలనే కోరిక ఉంది అని,కానీ ఇప్పటివరకు అది నెరవేర లేదని ఎమోషనల్ పాత్రలు ఎందుకో నాకు రావడం లేదు అంటూ చెప్పుకోచ్చారు. అయితే ఈ విషయాన్ని ఆయన నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ టైం లో చెప్పుకొచ్చారు. అయితే ఆయన సినీ కెరియర్ లో మాస్ కమర్షియల్ యాక్షన్ సోషియో ఫాంటసీ ఇలా ప్రతి ఒక్క జానర్ లో నటించారు.అలాగని ఎమోషనల్ పాత్రలో నటించలేదని కాదు.అలాంటి పాత్రల్లో కూడా నటించారు.

అలా డాడీ, ఆపద్బాంధవుడు, రుద్రవీణ వంటి సినిమాలు కూడా చేశారు.కానీ తనకి చరిత్రలో నిలిచిపోయే పాత్ర మాత్రం ఇప్పటివరకు రాలేదని ఎమోషనల్ పాత్రలు చేసినప్పటికీ ఎప్పటికీ మనల్ని గుర్తిండి పోయే పాత్రలు చేయాలనేది నా కోరిక అంటూ చెప్పుకొచ్చారు.ఇప్పటివరకు నాకు మాస్ కమర్షియల్ హీరోగా పేరు ఉంది. కానీ చరిత్రలో నిలిచిపోయే పేరు కావాలి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు నాగార్జున ధనుష్ కలిసిన నటించిన కుబేర సినిమా సక్సెస్ మీట్ లో కూడా ఈ విషయాన్ని మాట్లాడారు. కుబేర సినిమాలో ధనుష్ బెగ్గర్ గా నటించారు. కానీ ఇలాంటి ఎమోషనల్ పాత్ర నాకెందుకు రావడం లేదా అని బాధపడుతున్నాను. నా జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పాత్రలో కనిపించాలనే కోరిక నాకు ఉంది.

కానీ నా జీవితంలో ఉన్న ఈ లోటు ఎప్పుడు నెరవేరుతుందో ఇలాంటి పాత్రలు నాకెందుకు రావడం లేదో అని ప్రతిసారి అనుకుంటున్నాను. అయితే ఇలాంటి ఎమోషనల్ పాత్రలు చేయాలి అనుకుంటున్నా కానీ ఎందుకో చేయలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి ఉద్దేశం ఏంటంటే ఆయన ఇన్ని సినిమాలు చేసినప్పటికీ ఎమోషనల్ సినిమాలు చాలా తక్కువగా చేశారు. అందుకే ఎమోషనల్ సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించాలనే కోరిక, లోటు చిరంజీవి కెరియర్ లో ఉందట. అందుకే ఈ విషయాన్ని అలా చెప్పుకొచ్చారు. మరి నెక్స్ట్ రాబోయే సినిమాల్లోనైనా ఇలాంటి ఎమోషనల్ పాత్రల్లో చిరంజీవిని చూస్తామా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: