నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా చాలామంది ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అసలు మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు..? ఎవరి సపోర్ట్ లేకుండా ఎలా ఎదిగారు ..? అనే విషయాలను అభిమానులు హైలైట్ చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్, అలాగే అప్డేట్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.


చాలా తక్కువ సమయం ఈ గ్లింప్స్ ఉన్నప్పటికీ చిరంజీవి లోని డిఫరెంట్ యాంగిల్స్‌ను హైలైట్ చేస్తూ చూపించడం అభిమానులకు బాగా నచ్చింది. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత చిరంజీవి సరైన హిట్ కొట్టలేకపోయారని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ ఈ సినిమాతో మాత్రం చిరంజీవి వేరే లెవెల్ హిట్ కొట్టబోతున్నారని ఈజీగా అర్థమవుతుంది. ‘ఘరానా మొగుడు’ సినిమాలో కనిపించిన అటువంటి మాస్ యాంగిల్‌ను, “బాస్ ఇస్ బ్యాక్” అన్నట్లుగా ఈ సినిమాలో చూపించబోతున్నారని అనిల్ రావిపూడి చూపించిన గ్లింప్స్‌తో అర్థమైంది. ఈ సినిమాకి “మన శంకర వరప్రసాద్ గారు పండకి వస్తున్నాడు” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. చిరంజీవి ఒరిజినల్ నేమ్ ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టడం హైలైట్‌గా మారింది.


రిలీజ్ అయిన గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో చిరంజీవి నోటి నుండి చాలా నాటీ డైలాగ్స్ వినబోతున్నామని టాక్ బయటకు వచ్చింది. దానికి తగ్గట్టే ఈ గ్లింప్స్‌లో ఒక్క డైలాగ్ అయినా చెప్పి ఉంటే ఇంకా బాగుండేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గ్లింప్స్ మొత్తం బాగున్నా… చిరంజీవి జస్ట్ అలా మెరిసి ఇలా వెళ్ళిపోయారన్న ఫీలింగ్ వస్తోంది కానీ.. అభిమానులకు ఫుల్ గా కడుపునిండిన ఫీలింగ్ రావడం లేదు. ఒకవేళ అనిల్ రావిపూడి ఈ గ్లింప్స్‌లో చిరంజీవి చేత ఒక్క డైలాగ్ చెప్పించి ఉండి ఉంటే, రిజల్ట్ వేరే లెవెల్‌లో ఉండేది. ఇప్పటికే యూట్యూబ్‌ను దుమ్ముదులిపేసేవారు మెగా ఫ్యాన్స్. ఆ రేంజ్‌లో మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేసి ఉండేవారు. జస్ట్ మిస్..ఇకనైనా నెక్స్ట్ రిలీజ్ అయ్యే టీజర్, ట్రైలర్‌లో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడేమో అనిల్ రావిపూడి అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు..!! 


మరింత సమాచారం తెలుసుకోండి: