
మరోవైపు నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తోన్న “అనగనగా ఒక రాజు”. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ పట్ల బలమైన నమ్మకం ఉంది. అందుకే నేరుగా సంక్రాంతికి ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రేసులో కొత్తగా ఎంట్రీ ఇచ్చే బిగ్ ప్లేయర్ ప్రభాస్. ఆయన “రాజాసాబ్” సినిమాకు మొదట డిసెంబర్ 5 రిలీజ్ డేట్ లాక్ చేశారు. కానీ ఇప్పుడు స్ట్రాటజీ మార్చి.. సంక్రాంతి బెర్త్ బుక్ చేయాలని సీరియస్‌గా ఆలోచిస్తున్నారని టాక్. ఫ్యాన్స్ ఈ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సినిమా సీజన్‌కి వస్తే.. చిరంజీవి సినిమాకి 2–3 రోజుల గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఇక “రాజాసాబ్” షిఫ్ట్ అవుతుందని ముందే తెలిసి.. ‘అఖండ-2’ ని డిసెంబర్ 5కు మార్చేశారన్నది ఇండస్ట్రీలోని తాజా బజ్. రవితేజ – కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చే సినిమా కూడా సంక్రాంతికే అనుకున్నా.. టైమ్ ఫ్రేమ్‌లో సెటప్ చేయలేకపోవడంతో అది రేసు నుంచి తప్పుకుంది. మరింత ఫైర్ యాడ్ చేస్తున్నది తమిళ స్టార్ విజయ్ చివరి సినిమా “జననాయగణ్”. తమిళనాడులోనే కాదు.. తెలుగులోనూ భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఆయన చివరి మూవీ కావడంతో డిస్ట్రిబ్యూటర్ల నుంచి, థియేటర్ల నుంచి డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది. అందుకే చూస్తుంటే వచ్చే సంక్రాంతి రేస్ చిరంజీవి – ప్రభాస్ – నవీన్ పొలిశెట్టి – విజయ్ సినిమాల మధ్యే హై వోల్టేజ్ ఫైట్ కచ్చితమని ఇండస్ట్రీ టాక్! ఇక మిగతా సినిమాలు పెద్దగా జోక్యం చేసుకోలేవని ఫిల్మ్ నగర్‌లో హీట్ చర్చ జరుగుతోంది.