తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి వరుసగా సార్, లక్కీ భాస్కర్ వంటి భారీ హిట్స్ ఇవ్వడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌ రేంజ్‌కి చేరుకున్నాడు. తెలుగులోనే కాదు, పాన్‌ ఇండియా మార్కెట్‌లోనూ ఆయనకు మంచి డిమాండ్ వచ్చింది. వరుసగా తమిళ్ హీరోలతో హిట్స్ ఇచ్చిన వెంకీ అట్లూరి ఇప్పుడు మరోసారి తమిళ్ స్టార్ సూర్యతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ కాంబోపై ఇప్పటి నుంచే అభిమానుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సూర్య 46 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్‌ మొదలైన ఈ సినిమాకు “విశ్వనాథన్ అండ్ సన్స్” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. భారీ స్థాయి సెట్స్ వేసి, దాదాపు మెజార్టీ షూటింగ్‌ ఆ సెట్లోనే జరగబోతోందని తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో భారీ బడ్జెట్ ఖర్చు పెట్టడానికి ఎటువంటి వెనుకాడటం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.


సూర్యకి జోడీగా మమిత బైజు ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటుండగా, మరో హీరోయిన్‌ కోసం కూడా మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే, కయాదు లోహర్ పేర్లు వినిపించినా ఇప్పటివరకు ఆఫిషియల్ కన్‌ఫర్మేషన్ రాలేదు. వచ్చే షెడ్యూల్‌లో సూర్య, మమితపై కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఒక పాటను చిత్రీకరించనున్నారని సమాచారం. గత కొంత కాలంగా కంగువా, రెట్రో వంటి సినిమాలతో నిరాశపరిచిన సూర్య, ఈ సినిమా ద్వారా మళ్లీ తన స్థాయి చూపించాలనుకుంటున్నాడు. “ఆకాశమే నీ హద్దురా”, “జై భీమ్” తరహా ఇంపాక్ట్ ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతోందని బజ్. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మాస్ ఆడియన్స్ వరకు అందరినీ ఎంటర్టైన్ చేసేలా స్క్రిప్ట్ రాసినట్లు తెలుస్తోంది.



నిర్మాత నాగ వంశీ ఈ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే బయ్యర్ల నుంచి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వెంకీ అట్లూరి అనే బ్రాండ్‌కి, సూర్య స్టార్ పవర్‌కి కలిసొచ్చే ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద గట్టి హంగామా చేయడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మొత్తానికి సూర్యవెంకీ అట్లూరి కాంబో సినిమా మీద అభిమానుల్లో భారీ హైప్ ఏర్పడింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు, వెంకీ అట్లూరి క్రియేటివిటీ, సూర్య స్టార్ పవర్— అన్నీ కలిస్తే ఈ సినిమా వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద పెద్ద సునామీ సృష్టించడం ఖాయం..!

మరింత సమాచారం తెలుసుకోండి: