బాలీవుడ్ ఇండస్ట్రీ లో గత కొన్ని సంవత్సరాలుగా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ సినిమాలు భారీగా వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ జోనర్ నుండి మొదటగా సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ఏక్తా టైగర్ మూవీ వచ్చింది. ఇక స్పైయాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దానితో బాలీవుడ్ ఫిలిం మేకర్స్ స్పై యాక్షన్ జోనర్ సినిమాలను తీయడానికి అత్యంత ఆసక్తిని చూపించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా అదే సిరీస్‌లో వచ్చిన టైగర్ జిందా హై మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేతుకుంది. దీనితో బాలీవుడ్ ఫిలిం మేకర్స్ స్పై యాక్షన్ జోనర్ సినిమాలపై ఫోకస్ను మరింతగా పెంచారు.

ఆ తర్వాత ఇదే జోనర్లో హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్ హీరోలుగా వార్ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్లుగా పఠాన్ అనే మూవీ ని రూపొందించారు. ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇలా చాలా సంవత్సరాల పాటు బాలీవుడ్ ప్రేక్షకులు స్పై జోనర్ మూవీలను బాగానే ఆదరించారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం బాలీవుడ్ ప్రేక్షకులు ఈ జోనర్ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.

అందుకు ఉదాహరణ చూసుకున్నట్లయితే కొంత కాలం క్రితం హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన ఫైటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా టైగర్ 3 అనే మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా వార్ 2 అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా పెద్ద ఎత్తున నష్టాలను మిగిల్చుకునేలా కనబడుతోంది. దానితో చాలా మంది జనాలు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కొంత కాలం పాటు స్పై యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ మూవీలను పక్కన పెడితే బాగుంటుంది అని అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: