పదేళ్ల క్రితం బాహుబలి1  సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. బహుబలి1 విడుదలై పదేళ్లు కావడంతో బాహుబలి1, భాహుబలి 2 రెండు భాగాలను ఒకే మూవీగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరగగా ఈ ఏడాది అక్టోబర్ నెల 31వ తేదీన బాహుబలి : ది  ఎపిక్ పేరుతో ఈ సినిమా థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

బాహుబలి1, భాహుబలి2 సినిమాలలో ప్రేక్షకుల మెప్పు పొందిన ముఖ్యమైన షాట్స్ తో ఈ టీజర్ రూపొందింది. ఇప్పటివరకు ఏ రీరిలీజ్ సినిమాకు రాని  రెస్పాన్స్ ఈ సినిమాకు రావడం పక్కా అని చెప్పవచ్చు. ఎన్ని సంవత్సరాలు గడిచినా అటు ప్రభాస్ కెరీర్ లో ఇటు రాజమౌళి కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టీజర్ లోని షాట్స్ చూస్తే  గూస్ బంప్స్ పక్కా అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

ప్రభాస్ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే బాహుబలి సినిమాకు ముందు బాహుబలి సినిమాకు తర్వాత అని మాట్లాడుకోవాలి. భాహుబలి1,  భాహుబలి2 విజయాలు ప్రభాస్ ను ఎన్నో మెట్లు పైకి ఎక్కించాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. బాహుబలి : ది  ఎపిక్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయడం పక్కా అని చెప్పవచ్చు.  ప్రభాస్ కెరీర్ ప్లాన్స్  సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయనే సంగతి తెలిసిందే.

ఈ ఏడాది ప్రభాస్ నటించి విడుదలైన  సినిమా కన్నప్ప మాత్రమే కాగా ఈ సినిమాలో కూడా ప్రభాస్ పాత్ర గెస్ట్ రోల్ అనే సంగతి తెలిసిందే.  ది  రాజాసాబ్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతోంది. ది  రాజాసాబ్ ఎప్పుడు విడుదలైనా సంచలనాలు సృష్టిస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: