నటుడు జగపతిబాబు తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా అనే కొత్త షోతో మన ముందుకు వచ్చారు. ఈ షోలో ఇప్పటికే శ్రీలీల నాగార్జున వంటి సెలబ్రిటీస్ వచ్చారు. ఇక నెక్స్ట్ సండే నాచురల్ స్టార్ నాని రాబోతున్నారు. ఇప్పటికే నాని కి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో భాగంగా జగపతిబాబు ఫ్లాష్ బ్యాక్ గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే జయమ్ము నిశ్చమ్మురా షోలో నాని పర్సనల్ లైఫ్ గురించి జగపతిబాబు అడిగితే జగపతిబాబుని తిరిగి నాని ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించిన సమయంలో అప్పట్లో పెళ్లిళ్ల వరకు కూడా వెళ్లాను అంటూ మాట్లాడుతారు. అయితే ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో జగపతిబాబుకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని అందరు గుర్తుచేసుకుంటున్నారు.

ఇక జగపతిబాబు ఫ్లాష్ బ్యాక్ గురించి వచ్చిన వార్తలు ఏంటంటే.. జగపతిబాబు గతంలో ఓ ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో పెళ్లి వరకు వెళ్లారనే రూమర్లు వినిపించాయి.అందులో ముఖ్యంగా సౌందర్య.. జగపతి బాబు ఎఫైర్ వార్త రాగానే అందరికీ సౌందర్య పేరే గుర్తుకొస్తుంది. సౌందర్య జగపతిబాబు కాంబోలో సినిమాలు రావడమే కాకుండా వీరి మధ్య ప్రేమ వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అంతేకాదు సౌందర్య మరణించిన సమయంలో జగపతిబాబు కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇక ఇప్పటికి కూడా జగపతిబాబు ఏదైనా షోలో పాల్గొంటే కచ్చితంగా సౌందర్య కి సంబంధించి ఒక్క ప్రశ్న అయినా ఆయనకు ఎదురవుతుంది. ఇక మరో హీరోయిన్ ప్రియమణి.. జగపతిబాబు ప్రియమణి కాంబోలో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ సమయంలో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్లు టాలీవుడ్ లో వైరల్ గా మారాయి.

ఇక కొంతమంది అయితే మరీ మితిమీరి జగపతిబాబు ప్రియమణి రెండో పెళ్లి చేసుకుంటున్నారనే ప్రచారం చేశారు. ఇక మరో హీరోయిన్ కళ్యాణి.. సీనియర్ నటి కళ్యాణి జగపతిబాబు కాంబినేషన్లో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. అలా వీరిద్దరూ సినిమాలు చేసిన సమయంలో వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది అనే టాక్ వినిపించింది. కానీ ఈ వార్తలన్నీ కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి. కేవలం సౌందర్యతో మాత్రమే జగపతిబాబు రిలేషన్ పై స్ట్రాంగ్ వార్తలు వినిపించాయి. ఇక జగపతిబాబు జయమ్ము నిశ్చయమ్మురా షోలో పెళ్లిళ్ల వరకు వెళ్లి ఆగిపోయాయి అనే విషయం ఏ హీరోయిన్ గురించి మాట్లాడారు అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి: