టాలీవుడ్‌ బ్యూటీ నివేదా పేతురాజ్ ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్ తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ అందాల భామ, వినాయక చవితి రోజున తన జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభమవుతోందని వెల్లడించింది. ఈ సందర్భంగా కాబోయే భర్తతో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “జీవితాంతం ప్రేమ మయమే” అనే క్యాప్షన్ పెట్టింది. ఆ ఫోటోలలో లవ్ సింబల్స్, రింగ్ ఎమోజీలు కూడా జోడించడంతో, అవి ఒక్క‌సారిగా అంద‌ర‌కి షాక్ ఇచ్చాయి. ఈ ఫోటోలు బయటకు రాగానే ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు, సినీప్రేమికులు, స్నేహితులు అందరూ కంగ్రాట్స్ నివేదా అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోపక్క, రాజ్ హిత్ దుబాయ్‌లో స్థిరపడ్డ బిజినెస్ టైకూన్ అని తెలుస్తుంది.
 

వీరి పరిచయం ఎప్పుడో మొదలైంది? అది ఎప్పుడు ప్రేమగా మారింది? అనే ప్రశ్నలపై మాత్రం నివేదా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అందుకే ఈ లవ్ స్టోరీ ఇప్పటికీ మిస్టరీగానే మారింది. అయితే నివేదా పెళ్లి వార్తతో, సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. కొంతమంది నెటిజన్లు “విశ్వక్ సేన్ సంగతేంటి?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే, విశ్వక్ సేన్ – నివేదా కాంబినేషన్‌గా వచ్చిన ‘పాగల్’, ‘దాస్ క ధమ్కీ’ సినిమాలు మంచి హిట్స్ అయ్యాయి. ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందనే గాసిప్స్ బాగా హైలైట్ అయ్యాయి. అంతేకాదు, విశ్వక్ సేన్ ఆమెకు ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చి ప్రపోజ్ చేశాడనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అప్పట్లో ఈ జంట త్వరలో పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారం జరిగింది.



కానీ ఇప్పుడు నివేదా స్వయంగా తన పెళ్లి ఫోటోలు షేర్ చేయడంతో, ఆ గాసిప్స్ అన్నీ క్లారిటీగా రూమర్స్‌ మాత్రమే అని తేలిపోయినట్టే. విశ్వక్ సేన్ ఎపిసోడ్‌తో పోలిస్తే, ఈ కొత్త లవ్ స్టోరీ మరింత సీరియస్‌గా మారింది. టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఈ పెళ్లి న్యూస్, రాబోయే రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టే అవకాశం ఉంది. ఇక నివేదా పేతురాజ్ కెరీర్ విషయానికి వస్తే, కామెడీ, యాక్షన్, రొమాంటిక్ రోల్స్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త ఆరంభం చేయబోతుండడంతో, అభిమానులు ఆమెకు డబుల్ కంగ్రాట్స్ చెబుతున్నారు.


https://www.instagram.com/p/DN3WVHrZlDi/?utm_source=ig_web_copy_link




మరింత సమాచారం తెలుసుకోండి: