
అయితే, అభిమానుల ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. తాజా సమాచారం ప్రకారం, "రాజాసాబ్" విడుదలను మేకర్స్ మరోసారి వాయిదా వేసి, ఇప్పుడు 2026 జనవరి 9న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త బయటకు రావడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయట. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా భారీ స్థాయిలో జరుగుతున్నందున డిసెంబర్ 5లోపు అన్ని పనులు పూర్తవడం సాధ్యం కాదని మేకర్స్ భావిస్తున్నారట. ఈ ఆలస్యానికి కారణం సినిమా స్థాయిని తగ్గించకుండా, పర్ఫెక్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని టీమ్ తీసుకుంటున్న కేర్ అని చెబుతున్నారు.
ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపు ₹400 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం తన షెడ్యూల్ నుంచి ప్రత్యేకంగా మూడు నెలలు కేటాయించాడని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఆ మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తవుతుందని భావించినా, విజువల్ ఎఫెక్ట్స్, సెట్ వర్క్, యాక్షన్ సన్నివేశాల వలన షూటింగ్ నిరంతరంగా కొనసాగుతోందట. ఇప్పటికే వరుస వాయిదాల కారణంగా అభిమానుల్లో నిరాశ పెరిగినప్పటికీ, మేకర్స్ మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నారు. "ఎన్నిసార్లు రిలీజ్ వాయిదా పడ్డా, చివరికి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టిస్తుంది. ప్రభాస్ కెరీర్‌లోనే కాదు, భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా సినిమా రూపొందుతుంది" అని ధీమాగా చెబుతున్నారు.
ఇక ప్రభాస్ అభిమానులు మాత్రం "మేము ఎంత వాయిదాలు వచ్చినా ఓపిక పట్టి ఎదురుచూస్తాం. డార్లింగ్ సినిమానే మాకు పండుగ!" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద, "రాజాసాబ్" సినిమా డిసెంబర్ 5న కాకుండా 2026 జనవరి 9న విడుదల కానుందన్న వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.