
అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత సాయంత్రం ఒక హాస్పెటల్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి తన అత్తమ్మ చేసిన ఒక గొప్ప విషయాన్ని తెలియజేశారు. చిరంజీవి ఇలా మాట్లాడుతూ తాను తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మా అత్తగారు లేరనే వార్త వచ్చింది. అల్లు అరవింద్ కూడా ఆ సందర్భంలో బెంగళూరులో ఉండడంతో తానే వెళ్లానని తెలిపారు. ఆ సమయంలోనే తాము అనుకున్న ఆర్గాన్ డొనేషన్ తమకు గుర్తుకు వచ్చిందని. అలా అందరితో మాట్లాడి ఐ డొనేషన్ కి సిద్ధం చేశాను..
ఒకానొక సమయంలో చిరంజీవి తల్లి, అత్తమ్మ మధ్య ఈ విషయం గురించి చర్చించుకున్నామని.. ఈ విషయంపై కనకరత్నమ్మ గారు కాలి బూడిద అయ్యే శరీరాన్ని చచ్చిన తర్వాత ఏం చేస్తాము.. ఇచ్చేద్దామని చెప్పారని చిరంజీవి వెల్లడించారు. బెంగళూరు నుంచి దారి మధ్యలో వస్తున్న అల్లు అరవింద్ కి కూడా ఫోన్ చేసి చెప్పానని తెలిపారు చిరంజీవి. ఈ విషయం పైన కనకరత్నమ్మ గారు (చిరంజీవి అత్త) ఎక్కడ కూడా సంతకం పెట్టలేదు. గతంలో చెప్పిన ఆ మాటే ప్రతిజ్ఞలాగా అనిపించింది. అందుకే తన అత్త కనకరత్నమ్మ కళ్ళను తీసి హాస్పిటల్ కి పంపించాను అంటూ చిరంజీవి తెలియజేశారు. అందుకు సంబంధించి కొన్ని వీడియోలను ఫోటోలను కూడా చూపించారు చిరంజీవి. ఈ విషయం తెలిసి మెగా, అల్లు అభిమానులు కూడా కనకరత్నమ్మ గారు చాలా గ్రేట్ మరణించిన కూడా ఇంకొకరికి చూపు ఇస్తోంది అంటూ ఆమెను అభినందిస్తున్నారు.