సాధారణంగా హీరోయిన్స్ ఎక్కువగా ఫిట్నెస్ పై దృష్టి పెట్టడమే కాకుండా.. అందంగా కనిపించడానికి ఎక్కువ  ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందుకే చాలామంది హీరోయిన్స్ 50 ప్లస్ లో కూడా అంతే అందంగా.. ఫిట్  గా కనిపిస్తూ ఉంటారు.  అలా తరచూ బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హీరోయిన్ మలైకా అరోరా. ఈ అమ్మడు నిరంతరం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తనకంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఈమె డేటింగ్ లో ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఆ మధ్య విడిపోయినట్లు బాలీవుడ్లో మళ్లీ రూమర్స్ వినిపించాయి.


ఇదిలా ఉండగా.. మలైకా ఐదు పదుల వయసులో కూడా అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి.. ఈమె వ్యాయామంతో పాటుగా డీటాక్స్ డ్రింక్ కూడా తీసుకుంటుందట. ఈ డీటాక్స్ డ్రింక్ ఎలా తయారు చేస్తారంటే.. వాము, సోంపు, జీలకర్ర ఈ మూడింటిని గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి.. పరగడుపునే తీసుకోవాలంట.అసలు ఈ డీటాక్స్ డ్రింక్ అంటే శరీరంలో ఉండే మలినాలను తొలగించి, జీర్ణ వ్యవస్థను మరింత మెరుగుపరిచేలా చేస్తుంది. దీనితో.. బాడీ ఫిట్ గా,ఆరోగ్యంగా ఉంటుందని మలైకా అరోరా తెలియజేసింది. ఇదే తన ఫిట్నెస్ సీక్రెట్ అని చెప్పుకొచ్చింది. అయితే మలైకా అరోరా తీసుకునే ఈ డీటాక్స్ డ్రింక్ వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ నీటిని పరగడుపున తాగితే శరీరంలో ఉండే మలినాలు తొలగిపోయి,  చర్మం తాజాగా ఉంటుంది.  దీనివల్ల పూర్తి ఆరోగ్యంగా కూడా మారతారు.


బాలీవుడ్ లో మలైకా అరోరా ఎక్కువగా స్పెషల్ సాంగులలో కనిపించింది. మొదట ఈమె హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ను వివాహం చేసుకొని 19 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆరేళ్లపాటు అర్జున్ కపూర్ తో కూడా డేటింగ్ చేసిన మలైకా బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఐపీఎల్ మ్యాచ్లో శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర్ తో  కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లుగా రూమర్స్ వినిపించాయి. ఈ విషయం పైన కూడా ఎవరు స్పందించలేదు. మొత్తానికి తన డైట్ సీక్రెట్ని మాత్రం తెలియజేసింది మలైకా.

మరింత సమాచారం తెలుసుకోండి: