
ఇప్పటికే ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, బాలకృష్ణ, హీరోయిన్ పూర్ణ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. జైలర్ సినిమాకి మించి జైలర్ 2 లో భారీ ట్విస్టులు, క్యామియే రోల్స్ ఎక్కువగా ఉండబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. ఈ విషయం ఈ సినిమా అంచనాలను పెంచేసేలా కనిపిస్తోంది. ఇందులో ఒక కీలకమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ హల్చల్ చేస్తోంది. ఒకవేళ నటిస్తే విద్యాబాలన్ ఎలాంటి పాత్రలో కనిపించబోతోందనే విషయంపై అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, రజినీకాంత్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశారంటూ అభిమానుల సైతం మాట్లాడుకునేలా చేస్తున్నారు. జైలర్- 2 నుంచి వచ్చిన గ్లింప్స్ అందరిని బాగా ఆకట్టుకుంది. మరి జైలర్ 2 చిత్రంలో ఇంకా ఎంతమంది నటిస్తారో చూడాలి. ఇటీవలే రజినీకాంత్ నటించిన కూలీ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై మిక్స్డ్ టాకును సంపాదించుకుంది. సుమారుగా రూ.400 కోట్ల రూపాయల కలక్షన్స్ రాబట్టినట్లుగా వినిపిస్తోంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.