జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం డ్రాగన్.. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ మధ్యనే మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు స్క్రిప్ట్ విషయంలో ఊహించని మార్పులు జరుగుతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వరస సినిమాలతో సక్సెస్ డైరెక్టర్ గా పేరుపొందిన ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాని కూడా భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించేలా ప్లాన్ చేశారు. కానీ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ఇటీవలే విడుదలై పెద్దగా ఆకట్టుకోలేదు.


దీంతో వార్ 2 సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు డ్రాగన్ సినిమా ప్రాజెక్టు పైన పడినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని కొన్ని స్క్రిప్టులో కీలకమైన మార్పులు చేయాలని ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు సూచించినట్లు వినిపిస్తున్నాయి. వార్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా అసహనానికి లోనయ్యారు. ఎన్టీఆర్ పాత్రకి గుర్తింపు లభించినప్పటికీ సినిమా మొత్తం మీద చూసుకుంటే మిక్స్డ్ టాక్ ను మాత్రమే సంపాదించుకుంది.


వార్ 2 విషయంలో ఆడియన్స్ రెస్పాన్స్ ,పబ్లిక్ టాక్ బట్టి ఎన్టీఆర్ డ్రాగన్ ప్రాజెక్టు విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. తన మాస్ ఇమేజ్ ను పెంచుకునేలా ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేయమని ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు సలహా ఇచ్చారట. అందుకోసం డ్రాగన్ సినిమాలో కొన్ని సీన్స్ మార్చి  తన పాత్ర కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలని అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని ప్రశాంత్ నీల్ ను కోరినట్లుగా తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ చెప్పిన సజెషన్ ను  కాస్త పాజిటివ్గా తీసుకొని డైరెక్టర్ కూడా ఇందులోని కొన్ని సన్నివేశాలను మార్చేలా ప్లాన్ చేస్తున్నారట.  మరి ఈ మార్పులతో సినిమా కథ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.మొత్తానికి వార్ 2 ఎఫెక్ట్ డ్రాగన్ సినిమా మీద కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: