అల్లు శిరీష్ కెరీర్ ఇప్పటివరకు సరిగా ట్రాక్‌లో పడలేదు. మొత్తం ఎనిమిది సినిమాలు చేసినా, ఒక ష్యూర్‌షాట్ హిట్ మాత్రం ఆయన ఖాతాలో పడలేదు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి సినిమాలు “ఓకే.. ఓకే” అనిపించినా, బాక్సాఫీస్ స్థాయిలో శిరీష్ పేరు నిలబెట్టలేకపోయాయి. అల్లు అరవింద్ లాంటి శక్తివంతమైన బ్యాక్‌అప్ ఉన్నప్పటికీ, శిరీష్ కెరీర్ ఊహించని ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.గతేడాది వచ్చిన బడ్డి కూడా పెద్దగా ఆడకపోవడంతో, ఇప్పుడు శిరీష్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి టైంలో ఒక మంచి కథ కోసం వెతికిన ఆయన, చివరికి సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. యాక్షన్ జానర్‌ను పక్కన పెట్టి, పూర్తిగా కామెడీ, ఫన్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


ఈ ప్రాజెక్ట్‌కి బచ్చలమల్లి ఫేమ్ సుబ్బు దర్శకుడిగా ఎంపికయ్యే అవకాశం ఉందని టాక్. సుబ్బు సోలో బ్రతుకే సో బెటరుతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి, తర్వాత బచ్చలమల్లిపై పెద్ద ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే, ఆయన తాజాగా రాసిన స్క్రిప్ట్ బలంగా ఉందని ఫిల్మ్ నగర్ టాక్.ఇన్‌సైడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కథలో ‘సామజవరగమన’ తరహా ఫన్ టచ్ ఉందని చెబుతున్నారు. రైటింగ్ టీమ్ కూడా స్ట్రాంగ్‌గా ఉండటంతో, ఈసారి కంటెంట్ వర్కవుట్ అయితే హిట్ ఖాయం అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ మినిమమ్ గ్యారెంటీ ప్యాకేజ్ లాంటి సినిమా అవుతుందన్న నమ్మకం టీమ్‌కు కలిగింది.



శిరీష్ కూడా ఇదే నమ్మకంతో స్క్రిప్ట్‌కి ఓకే చెప్పాడని సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోందని చెబుతున్నారు.ఇక శిరీష్‌కి ఈ సినిమా ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ కూడా పనిచేయకపోతే, ఆయన కెరీర్ మరింత కఠిన పరిస్థితుల్లో పడిపోవచ్చు. అందుకే ఈసారి పూర్తి ఫన్ ఎంటర్‌టైనర్తోనే రిస్క్ తీసుకోకుండా క్లియర్ హిట్‌కి ప్లాన్ చేస్తున్నాడు. చూస్తుంటే, ఈ ప్రాజెక్ట్ శిరీష్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: