తెలుగు సినీ పరిశ్రమలో హీరో–హీరోయిన్ల జోడీలు చాలా వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని జోడీలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి వాటిలో ప్రభాస్ - అనుష్క జంట చాలా చాలా స్పెష‌ల్ అని చెప్పుకోవ‌చ్చు. వీరిద్దరి కలయిక తెరపై కనిపిస్తే ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుందని అభిమానులే కాదు సినీ ప్రియులు కూడా ఫీల్ అవుతుంటారు. ఆన్ స్క్రీన్‌పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ జంట‌కు స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది.


అయితే ప్ర‌భాస్ తో మీ కెమిస్ట్రీ ఎందుకంత స్పెష‌ల్‌గా ఉంటుంది అని తాజాగా ఓ ఆడియో ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా.. అనుష్క క్రేజీ ఆన్స‌ర్ ఇచ్చింది. `నేను, ప్రభాస్ వెండితెరపై అంత స్పెషల్‌గా కనిపించడానికి మెయిన్ రీజ‌న్‌ కథ, క్యారెక్టర్స్‌ని రాసిన విధానం. అలాగే రియ‌ల్ లైఫ్‌లో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. స్నేహంలో ఒక కంఫర్ట్ ఉంటుంది. ఆ కంఫ‌ర్ట్ వ‌ల్లే మా మ‌ధ్య వ‌చ్చే సీన్లు సహజంగా, నిజాయితీగా కనిపిస్తాయి. ఏదేమైనా సరైన క్యారెక్టర్స్, కథ ఉంటేనే కెమిస్ట్రీ పండుతుంది` అంటూ అనుష్క చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి.


కాగా, `మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి` వంటి డీసెంట్ హిట్ అనంత‌రం అనుష్క నుంచి రాబోతున్న యాక్ష‌న్ క్రైమా డ్రామా `ఘాటీ`. క్రిష్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో అనుష్కకు జోడిగా విక్రమ్ ప్రభు న‌టించారు. సెప్టెంబ‌ర్ 5న ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతుంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన కంటెంట్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు. మ‌రి ఆ అంచ‌నాల‌ను ఘాటీ రీచ్ అవుతుందా? అనుష్క మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను మెప్పించి హిట్ కొడుతుందా? అన్న‌ది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: