
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ సమ్మె వల్ల సుమారుగా 15 రోజులపాటు సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యిందని.. మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తమకు చాలా కోఆపరేట్ చేశారని సినిమా కొత్త షెడ్యూల్ మొదలయ్యింది. నవంబర్ 15 లోపు షూటింగ్ పూర్తి చేసి కచ్చితంగా సంక్రాంతికి మీ ముందుకు తీసుకు వస్తామని ధైర్యంగా తెలియజేశారు. ఈ విషయంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిత్రాన్ని కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి బర్త్డే సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇందులో చాలామంది సెలబ్రిటీలు నటిస్తున్నారు.
చిరంజీవి సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ వశిష్ఠ తో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాల్సి ఉండగా గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతోంది. వచ్చే ఏడాది దాదాపుగా రెండు చిత్రాలతో చిరంజీవి అభిమానులను ఫుల్ ఖుషి చేసేలా కనిపిస్తున్నారు. ఓదెల సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమా చేయబోతున్నారు. అలాగే డైరెక్టర్ బాబి కొల్లి డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయబోతున్నారు. ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టి దూసుకుపోతున్నారు చిరంజీవి.