కొన్ని సార్లు మనకు తెలియకుండానే కొన్ని విషయాల్లో తప్పులు చేస్తూ ఉంటాం. అలా రీసెంట్‌గా మలయాళ నటి నవ్యా నాయర్ సుమారు లక్ష రూపాయలు జరిమానా కట్టుకోవాల్సి వచ్చింది. గత కొన్ని గంటలుగా ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రముఖ మలయాళ నటి నవ్యా, మల్లెపూలను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లినందుకు సుమారు లక్ష 14 వేల రూపాయల జరిమానా విధించబడింది. మల్లెపూలను తీసుకెళ్లినందుకు ఆస్ట్రేలియా విమానాశ్రయ అధికారులు ఆమెపై ఈ జరిమానా విధించారు. అక్కడి కఠిన నిబంధనల ప్రకారం కేవలం మల్లెపూలే కాదు, మరెన్నో వస్తువులను కూడా తీసుకెళ్లడం నిషేధం.


ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్లకూడని వస్తువులు:

*ఎండిన పూలు, తాజా పూలు

*పండ్లు, కూరగాయలు

*మూలికలు, సుగంధ ద్రవ్యాలు

*పాల ఉత్పత్తులు

*ముడి గింజలు, విత్తనాలు

*స్వీట్స్, బియ్యం, తేనే, టీ

*ఇంట్లో తయారుచేసిన ఆహారం

*పెంపుడు జంతువుల ఆహారం

*బర్ఫీ, గులాబ్‌జామున్, మైసూర్ పాక్

*పక్షులు, జంతువులు, ఈకలు, ఎముకలు

*చర్మంతో చేసిన జాకెట్లు, బ్యాగులు, దుప్పట్లు

ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్ట్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అక్కడి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. విదేశీ ప్రయాణికులు నిషేధిత వస్తువులను తీసుకెళ్తే ఆ వస్తువులకు తగ్గట్టుగా జరిమానా లేదా కఠిన శిక్ష విధిస్తారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను వెంటనే ధ్వంసం చేస్తారు. ఉల్లంఘన తీవ్రత ఎక్కువైతే జరిమానా మాత్రమే కాకుండా జైలు శిక్ష కూడా విధించవచ్చు. చాలా తీవ్రమైన సందర్భాల్లో ప్రయాణికుల వీసాలను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది.



కొంతమంది దొంగచాటుగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు, కానీ ప్రతిచోటా సెక్యూరిటీ చెక్ ఉంటుంది. నిషేధిత వస్తువులను విమానాశ్రయం లోకి తీసుకెళ్లి దొంగచాటుగా సరఫరా చేయాలని చూస్తే అక్కడి అధికారులు కఠినంగా శిక్షిస్తారు. ఈ నిషేధానికి కారణం కొన్ని రకాల ఆహార పదార్థాలు మరియు వస్తువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని వారు నమ్మకం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, వివిధ రకాల వ్యాధులు రాకుండా ఉండేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఈ విధంగా ఆస్ట్రేలియా పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: