
తేజ సజ్జా వ్యాఖ్యలతో మంటలు .. ఇటీవల తేజ సజ్జా ‘మిరాయ్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఈ సినిమాను SSRMB అని పిలిచాడు. అంతే… మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. “మేము ఇన్నాళ్లుగా #SSMB29 అని పిలుస్తున్నాం … ఇప్పుడు కొత్తగా హ్యాష్‌ట్యాగ్ ఎందుకు?” అంటూ సోషల్ మీడియాలో ఘాటైన రియాక్షన్లు ఇచ్చారు. ఇక రాజమౌళి అభిమానులు మాత్రం తేజకు సపోర్ట్ చేశారు. దీంతో SSRMB vs SSMB29 హ్యాష్‌ట్యాగ్ వార్ మరింత పెద్దదైంది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ .. ఒక సినిమా పేరు పెట్టకముందే షార్ట్ నేమ్ కోసం ఇంత రచ్చ జరగడం ఇదే తొలిసారి అని చెప్పాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇది ఫన్నీగా, అలాగే ఇంట్రస్టింగ్‌గా మారింది.
అసలు ఈ డిబేట్‌కు క్లారిటీ రావాలంటే సినిమా యూనిట్ అధికారికంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి, సరైన హ్యాష్‌ట్యాగ్ ప్రకటించాల్సిందే. లేకుంటే ఈ చర్చ పెరుగుతూనే ఉంటుంది. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పీక్‌లో .. ఏదేమైనా ఇది భారతీయ సినీ చరిత్రలోనే అతి పెద్ద యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపుదిద్దుకోబోతోంది. రాజమౌళి ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్లాన్ చేస్తుండగా, మహేష్‌బాబు గ్లోబల్ స్టార్‌గా అవతరించబోతున్నాడనే నమ్మకం ఫ్యాన్స్‌కి ఉంది. టైటిల్ గోలేమైనా సరే, ఈ మూవీపై ఉన్న క్రేజ్ మాత్రం నెవర్ బిఫోర్ – ఎవర్ ఆఫ్టర్ స్థాయిలో ఉందని చెప్పొచ్చు.