
అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు సైన్ చేయడానికి నయన్ పెట్టిన డిమాండ్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
మన శంకర వరప్రసాద్ గారు కోసం నయనతార రూ. 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అంతేకాకుండా తన ప్రయాణ ఖర్చులు, తాను స్టే చేయడానికి అవసరమయ్యే వసతులతో పాటు తన వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు కూడా నిర్మాతలే భరించాల్సి ఉంటుందని ముందే చెప్పేసిందట. ఇవన్నీ అగ్రిమెంట్ లో భాగమే. భారమైనా కూడా నిర్మాతలు ఆమె డిమాండ్స్ కు ఒప్పుకోక తప్పలేదట.
ఇక ఇటీవల నయనతార సినిమాలోని ఓ సాంగ్ షూట్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఒంటరిగా కాదండోయ్.. ఆమెతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు.. వారిని చూసుకోవడానికి ఇద్దరు కేర్‌టేకర్లు, అదే విధంగా ఇంకో నలుగురు అసిస్టెంట్లు కూడా నయన్ వెంట వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు షాకైపోతున్నారు. చిరు మూవీ నిర్మాతలకు నయన్ ఏ రేంజ్ లో చుక్కలు చూపిస్తుందో ఈ వీడియోతోనే స్పష్టమవుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.