
ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా సెటిల్డ్ గా నటించి మంచి పాపులరిటీ సొంతం చేసుకుంది రితికా నాయక్. మిరాయ్ రిలీజ్ తర్వాత ఈ బ్యూటీ గురించి సెర్చింగ్ మొదలైంది. ఢిల్లీలోని ఒడియా ఫ్యామిలీలో రితికా నాయక్ జన్మించింది. ఢిల్లీ పోలీస్ పబ్లిక్ స్కూల్‌లో స్కూలింగ్ ను కంప్లీట్ చేసిన రితికా.. ఆపై మాస్టర్స్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేరింది.
కాలేజీ రోజుల్లోనే రితికా నాయక్ కు మోడలింగ్ పై మక్కువ ఏర్పడింది. 2019లో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 12ను గెలుచుకుంది. ఆ తర్వాత పలు నగరాల్లో వివిధ ఆడిషన్లలో పాల్గొన్న రితికా నాయక్‌కు.. `అశోక వనంలో అర్జున కళ్యాణం` చిత్రంలో తొలి అవకాశం వచ్చింది. విశ్వక్ సేన్ ఇందులో హీరో. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో రితికాకు సరైన గుర్తింపు దక్కలేదు.
ఆ తర్వాత `హాయ్ నాన్నా` మూవీలో నాని కూతిరిగా అతిధి పాత్రలో మెరిసింది. రితికా మూడో సినిమా మిరాయ్. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడంతో రితికాకు ఇప్పుడు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ `డ్యూయెట్`తో పాటు వరుణ్ తేజ్‌కు జోడిగా ఒక సినిమా చేస్తోంది. కాగా, రితికా నాయక్ కు అల్లు అర్జున్ అంటే పిచ్చ అభిమానమట. బన్నీతో కలిసి ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని.. ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే స్టోరీ ఎలాంటిదైనా.. ఏ పాత్రైనా చేస్తానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రితికా వెల్లడించింది. మరి ఈ యంగ్ బ్యూటీకి అల్లు అర్జున్ ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.