
టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “ మిరాయ్ ”. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ సినిమా థియేటర్స్ లో మంచి హైప్ మధ్య రిలీజ్ అయ్యి వసూళ్ల పరంగా దుమ్ము రేపుతోంది. పైగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి సినిమాకు పోటీగా వచ్చిన మిరాయ్ బాక్సాఫీస్ దగ్గర సెన్షేషనల్ హిట్ అయ్యింది. తొలి రోజు నుంచే సాలిడ్ నంబర్స్ నమోదు చేసిన ఈ సినిమా అక్కడ నుంచి నిన్న వర్కింగ్ డే సోమవారం కూడా స్ట్రాంగ్ వసూళ్లు రాబట్టి థియేటర్లలో దుమ్ము దులుపుతోంది .
ఇలా మొత్తం 4 రోజుల రన్ కి మిరాయ్ ఏకంగా 90 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా 4 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా రు. 91.45 కోట్ల గ్రాస్ ని అందుకొని నెక్స్ట్ స్టాప్ గా 100 కోట్ల మార్క్ ని చేరుకోడానికి పరుగులు పెడుతోంది. ఈ రికార్డ్ ఈ ఐదో రోజే కొట్టేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పాలి. ఈ క్రేజీ ప్రాజెక్టులో మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ గా నటించగా గౌర హరి సంగీతం అందించారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు