ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ కచ్చితంగా నెగిటివిటీ ఉంటుంది. ఎక్కడ పొగిడే వాళ్లు ఉంటారో అక్కడ మనల్ని తిట్టే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఎక్కడ ఒక సినిమాని ప్రమోట్ చేసే వాళ్లు ఉంటారో అక్కడ ఆ సినిమాని తొక్కేసే వాళ్లు కూడా ఉంటారు. ఆ విషయం రీసెంట్‌గానే బయటపడింది. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మేము పవన్ కళ్యాణ్ అభిమానులమని చెప్పుకునే ఒక దొంగ బ్యాచ్ బయటపడింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ కొన్ని రకాల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ కొంతమంది ఫేక్ పవన్ కళ్యాణ్ అభిమానులు క్రియేట్ చేసినవే అంటూ క్లారిటీకి వచ్చింది.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా, హై బడ్జెట్‌తో తీసుకుని అంటించిన సినిమా "ఓజీ". ఈ సినిమా కేవలం కొద్ది రోజుల్లోనే గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా విడుదల అవుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లోనే రిలీజ్ కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఏడాది పాటు వాయిదా పడినప్పటికీ అంచనాలు పెరిగాయి తప్ప తగ్గలేదు. ముఖ్యంగా రీసెంట్‌గా రిలీజ్ అయిన పాటలు, పవన్ కళ్యాణ్ లుక్ సినిమా రేంజ్‌ను మరింత పెంచేశాయి. ఈ సినిమాకి సంబంధించిన రెండు క్రేజీ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ స్టిల్స్ మీడియాను షేక్ చేసేశాయి. గ్లింప్స్ లో చూపించిన ఔట్‌ఫిట్స్‌లో పవన్ లుక్ అదిరిపోయే రేంజ్‌లో కనిపించాడు. అయితే ఇవన్నీ ఒరిజినల్ కాదని, పవన్ కళ్యాణ్‌లో ఇంత మార్పు రావడం అసాధ్యమని, ఇవన్నీ ఏఐ మాయాజాలమే అంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేశారు. కానీ ఇది పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకోవడానికి చేసిన కుతంత్రం అని తాజాగా బయటపడింది.



దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. “ఎవరు ఏం చేసినా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను అడ్డుకునే ప్రసక్తే లేదు. ఇది బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది” అంటూ ముందుగానే ఫిక్స్ అయిపోయారు. “ఓజీ నుంచి భారీ ఫెస్ట్ గ్యారెంటీ” అంటూ గెట్ రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో స్టిల్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు.“కావాలనే కొందరు ఇలా కుళ్లు బయటపెట్టి ట్రోల్ చేస్తున్నారు.. కానీ పవన్ కళ్యాణ్ సినిమాను ఎవరు ఆపలేరు” అంటూ ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. “ఓజీని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారా? ఇది అంతా ఏఐ మాయాజాలమంటున్నారా? పోతారు, నాశనం అయిపోతారు” అంటూ మరికొందరు ఘాటు రియాక్షన్ ఇస్తున్నారు. ఈ సినిమాకి అందించిన ధమన్ సంగీతం ఇప్పటికే ఆకట్టుకుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా రిలీజ్ అయితే, మొదటి రోజు కలెక్షన్లు పవన్ కళ్యాణ్ రేంజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్తాయి అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో...??

మరింత సమాచారం తెలుసుకోండి: