పవన్ కళ్యాణ్‌కి అభిమానులు అనగానే మనకు కేవలం 25, 35, 45 ఏళ్ల వయసు గల యువత, మేజర్ వయసు వారే గుర్తుకు రావచ్చు. కానీ ఆయనకు ఉన్న అభిమాన గణం అంతటితో ఆగిపోదు. ఆశ్చర్యం కలిగించే విధంగా 10 నుంచి 15 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు కూడా పవన్ కళ్యాణ్ సినిమాలను విపరీతమైన క్రేజ్‌తో ఫాలో అవుతున్నారు. ఆయన సినిమాలు థియేటర్లలో విడుదలైతే ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలని చిన్న పిల్లలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను పాఠశాల విద్యార్థులు కూడా ప్రత్యేకంగా సెలవులు తీసుకుని చూసిన ఉదాహరణలు ఉన్నాయి.


కానీ ప్రతి సినిమా ఒకేలా ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ఓజీ సినిమా మాత్రం పూర్తిగా భిన్నంగా నిలిచింది. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు కఠినమైన నిర్ణయం తీసుకుంది. సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు చూసి ఏకంగా “ఆ” సర్టిఫికెట్ ఇచ్చింది. అసలు మేకర్స్ మొదటగా ఈ సినిమాను ఊ/ఆ సర్టిఫికేట్ వస్తుందని భావించి టికెట్లను అమ్మేశారు. ఆ సమయంలో చాలా ఫ్యామిలీలు పిల్లలతో పాటు టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో సెన్సార్ బోర్డు కొన్ని కట్స్ సూచించినప్పటికీ, సినిమాలో ఉన్న ఎక్స్‌ట్రీమ్ వైలెన్స్ కారణంగా చివరికి “ఆ” సర్టిఫికేట్ నే మంజూరు చేసింది.



ఇప్పుడు సమస్య ఏమిటంటే — ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలను థియేటర్లు లోపలికి అనుమతిస్తారా? లేకపోతే రిఫండ్ ఇస్తారా? కొన్ని మల్టీప్లెక్స్‌లలో ఇప్పటికే 18 సంవత్సరాలు లోపు పిల్లలకు ఎంట్రీ ఇవ్వరాదనే నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నారు. దీంతో అభిమానులలో గందరగోళం నెలకొంది. ముందుగానే బుక్ చేసిన టికెట్లు ఇప్పుడు ఉపయోగం ఉండకపోవచ్చని కొంతమంది ఆందోళన చెందుతున్నారు.సినిమా సెన్సార్ టాక్ ప్రకారం, ఓజీలో హింసాత్మక సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చేతిలో కత్తి పట్టుకుని శత్రువులను నరికి పడేయడం, తలలు ఎగిరిపడేలా చూపించడం వంటి యాక్షన్ సీన్స్ పెద్దలకే గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని, అలాంటి సన్నివేశాలను మైనర్ పిల్లలు తట్టుకోలేరని సెన్సార్ అధికారులు భావించారు. అందుకే కఠినంగా “ఆ” సర్టిఫికేట్ ఇచ్చారని తెలుస్తోంది.



ఇక థియేటర్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికే చాలా మంది పిల్లలు పవన్ కళ్యాణ్ అభిమానులమని గర్వంగా చెప్పుకుంటూ, ఆయన సినిమాను మిస్ కాకూడదని ఆత్రుతగా ఉన్నారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండటం వల్ల వాళ్లకు నిరాశ తప్పదేమో అన్న వాతావరణం ఏర్పడింది.సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ నడుస్తోంది. “పవన్ కళ్యాణ్ సినిమాలు చూడటానికి ఎప్పటినుంచో ఎదురుచూసే చిన్నారులు ఇప్పుడు థియేటర్లలోకి రావడానికి అవకాశం లేకపోవడం చాలా బాధాకరం” అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది “డైరెక్టర్ సుజిత్ తీసుకున్న హింసాత్మక ప్రదర్శన పవన్ చిన్నపిల్లల ఫ్యాన్స్‌కి నిజంగానే తలనొప్పిగా మారిపోయింది” అంటూ విమర్శిస్తున్నారు.ఇక మొత్తం మీద ఓజీ సినిమాను సుజిత్ పవన్ కళ్యాణ్‌ని వేరే లెవెల్‌లో చూపించే ప్రయత్నం చేశాడనే మాట నిజమే కానీ ఆ వేరే లెవెల్‌లోని హింస చిన్నారుల అభిమానాన్ని అడ్డగించిందనేది మాత్రం సత్యం...!

మరింత సమాచారం తెలుసుకోండి: