
ఇప్పుడు అలాంటి పరిస్థితి మరొక టాలీవుడ్ హీరోయిన్ కి ఎదురయ్యింది. పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా ఈ రోజున విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ నేహా శెట్టి స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందని సినిమా రిలీజ్ కి ముందు భారీ హైప్ తీసుకువచ్చారు. కానీ తీరా చూస్తే నేహా శెట్టి సాంగే ఇందులో కనిపించలేదట. దీంతో ఈ సాంగ్ ని ఎడిటింగ్ లో తీసేసారేమో అంటు అభిమానులు భావిస్తున్నారు. అయితే సినిమాలో చూస్తే ఎక్కడా కూడా స్పెషల్ సాంగ్ కనిపించేందుకు స్కోప్ లేదని అందుకే ఎడిటింగ్ లో తీసేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఈ విషయం పైన హీరోయిన్ నేహా శెట్టి స్వయంగానే స్పందించాల్సి ఉంది. మరి ఓటీటిలో అయిన ఈ సాంగ్ ని యాడ్ చేస్తారా? లేకపోతే దసరా పండుగకు యాడ్ చేసి సర్ప్రైజ్ ఇస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి మొన్న నిధి అగర్వాల్ కు ఎదురైన అనుభవం ఇప్పుడు నేహా శెట్టి కి ఎదురయింది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న నేహా శెట్టి ఓజి సినిమా అవకాశాలను తెచ్చి పెట్టేలా చేస్తుందనుకున్న సమయంలో నిరాశనే మిగిల్చింది..