టాలీవుడ్‌లో ఇటీవ‌ల కాలంలో సీక్వెల్ ట్రెండ్ బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఒక హీరోకి మంచి ఇమేజ్ ఉంటే, ఆయనతో చేసిన సినిమాకి క్లైమాక్స్‌లోనే పార్ట్ 2కి అవకాశం ఉండేలా సెటప్ చేయడం మామూలైంది. బాహుబలి, పుష్పలాంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్ అయ్యాకే రెండో భాగం లైమ్‌లైట్‌లోకి వచ్చాయి. అదే సమంత “యశోద”, కళ్యాణ్ రామ్ “డెవిల్”, చిరంజీవి “గాడ్ ఫాదర్”, విజయ్ దేవరకొండ “కింగ్డమ్” వంటి సినిమాలు కూడా కొనసాగింపు ఉంటుందనే హింట్స్ ఇచ్చినా ఆ సినిమాల సీక్వెల్స్ తెర‌కెక్కే ఛాన్సులు చాలా త‌క్కువ‌. ఇలాంటి ట్రెండ్‌లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఓజి” కూడా చేరింది. అయితే ఓజీ సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో ఈ సినిమాకు ఖ‌చ్చితంగా సీక్వెల్ ఉంటుంద‌నే అంటున్నారు.


దర్శకుడు సుజిత్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో “ ఓజి ”ని త్రిలజీగా ప్లాన్ చేశానని తెలిపారు. అంటే ఓజీతో పాటు  మరో రెండు భాగాలు ఉండే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ త‌న ఛ‌రిష్మాతో ఎప్పుడు అయితే ఓజీని వ‌న్ మ్యాన్ షో చేసి సూప‌ర్ హిట్ చేశారో.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప‌క్కా అని క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, త్రివిక్రమ్, నిర్మాత డివివి దానయ్యతో చర్చల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా “ఓజి 2” చేయడానికి ఆసక్తి చూపారట. అయితే వెంటనే ఇది మొదలయ్యే ఛాన్స్ తక్కువ. ప‌వ‌న్‌కు ఉన్న బిజీ షెడ్యూల్ నేప‌థ్యంలో ఓజీ 2 ఎప్పుడు ఉంటుంద‌న్న‌ది ఎవ్వ‌రికి చెప్ప‌లేం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అయినా కూడా ఆయన సినిమా చేస్తే, మొదటగా “ఓజి 2”కే గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చని వర్గాల సమాచారం. “ఉస్తాద్ భగత్ సింగ్” ప్రాజెక్ట్ పూర్తయ్యాక ప‌వ‌న్‌కు రాజ‌కీయంగా ఫ్రీ టైం ఉంటే ఓజీ 2 ప‌ట్టాలు ఎక్క‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: