
హిందూ సనాతన ధర్మంలో దానానికి చాలా విశిష్టత ఉన్నది. దసరా పండుగ రోజున పేదవారికి లేదా బ్రాహ్మణులకు.. బియ్యం, గోధుమలు, పప్పులు, కొత్త దుస్తులు వంటివి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇలాంటివి చేయడం వల్ల ఆ ఇంటిలో పేదరికం తొలగిపోతుందని పండితులు తెలుపుతున్నారు.
జ్యోతిష్యం ప్రకారం దసరా రోజున పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల.. శుభప్రదంగా భావిస్తారు. అలాగే కొబ్బరికాయలు స్వీట్లు వంటివి పసుపు రంగుల దుస్తులతో పాటుగా బ్రాహ్మణులకు దానం చేస్తే అటు వ్యాపార రంగంలో ఎలాంటి అడ్డంకులు ఉన్న తొలగిపోతాయని తెలుపుతున్నారు.
భారతీయ సాంప్రదాయాలలో చీపురును కూడా లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే ఈ రోజున చీపురును దానం చేసిన లేకపోతే ఏదైనా గుడిలో కొత్త చీపురును దానం చేసిన ఆ ఇంటికి ప్రతికూల శక్తి లభించడమే కాకుండా, వాస్తు దోషాలను తొలగించడమే కాకుండా, ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసి పేదరికాన్ని తొలగిస్తుంది.
పండ్లు దసరా రోజున దానం చేయడం వల్ల వ్యాపారాలలో పురోగతి లభిస్తుంది. అలాగే భోజనం అంటూ ఇంటికి వచ్చిన వారికి పెట్టిన మంచి జరుగుతుంది.
దసరా రోజున వివాహిత స్త్రీకి.. పసుపు, కుంకుమ, గాజులు వంటివి దానం చేయడం వల్ల శుభప్రదంగా పరిగణిస్తారు.