
ఇక ప్రస్తుత కాలంలో కూడా అలాంటి ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా "ఫ్యాన్ బాయ్ మూమెంట్" అనే పదం బాగా వినిపిస్తోంది. ఒక డైరెక్టర్ లేదా ఒక రైటర్ తన హీరోని ఎలా చూడాలనుకుంటున్నాడో, ఆ హీరోని ఎలా ఎలివేట్ చేయాలనుకుంటున్నాడో, దాన్ని తెరపై చూపిస్తే అభిమానులకు గూస్బంప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సుజిత్ "ఓజీ" సినిమాలో పవన్ కళ్యాణ్‌ని అలాంటి ఫ్యాన్ విజన్‌లో ప్రెజెంట్ చేయడం, అభిమానులు ఏ స్థాయిలో తమ హీరోని చూసుకోవాలని కలలు కంటారో అచ్చంగా అదే విధంగా చూపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో సుజిత్‌కి "ఫ్యాన్ బాయ్ డైరెక్టర్" అనే ట్యాగ్ కూడా వచ్చేసింది.
ఇటీవల జరిగిన ఓజి సక్సెస్ సెలబ్రేషన్స్ లో పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడుతూ.. అభిమానుల పట్ల తనకున్న భావోద్వేగం, వారి ప్రేమ ఎంత గొప్పదో హైలైట్ చేయడం నిజంగానే జనాలకు గూస్బంప్స్ తెప్పించింది. ఈ తరహా సందర్భాల వలన ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలు కూడా తమ అభిమానులు డైరెక్టర్‌గా ఎదిగితే వారికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారన్న చర్చ బలంగా సోషల్ మీడియాలో నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు కూడా ఇలాంటి డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తే, ఆ అభిమానుల జీవితంలో అది నిజంగా ఒక "ఓజి" లాంటి అదృష్టం అవుతుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో మాట్లాడుకుంటున్నారు.
అయితే దీనిపై మరోవైపు కొంతమంది ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ప్రతి డైరెక్టర్ ఫ్యాన్ బాయ్ సుజిత్ అవ్వడం సాధ్యం కాదని, పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్, ఆయన ఇమేజ్, ఆయన మేనరిజమ్స్‌కి సరిపోయే డైరెక్షన్ వలన ఓజీ బ్లాక్‌బస్టర్ అయిందని చెబుతున్నారు. అదే ఫార్ములా అన్ని సినిమాల్లో పని చేస్తుందా..? అంటే కష్టం అంటున్నారు. ప్రతి స్టార్ హీరోకి తనకంటూ ఓ స్టైల్ ఉంటుంది, ఓ ప్రెజెంటేషన్ ఉంటుంది. అందుకే "ప్రతి సినిమా ఫ్యాన్ బాయ్ డైరెక్టర్‌తో బ్లాక్‌బస్టర్ అవ్వదు" అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ డిస్కషన్‌తో మరోసారి సోషల్ మీడియాలో సుజిత్ పేరు హాట్ టాపిక్ అయింది. ఆయన లెవెల్‌లోకి వెళ్లడం సులభం కాదని చాలామంది అంటున్నప్పటికీ, "ఓజీ" ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం టాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు..!