ఎన్నో విద్యా సంస్థలను స్థాపించి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న మల్లా రెడ్డి ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అందులో కూడా అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పని చేసిన ఈయనకు మంచి క్రేజ్ ఉంది. తన మాటలతో ఎంతో మంది జనాలను ఈయన ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. శ్రీ లీల , రాశి కన్నా ఈ మూవీ లో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మూవీ లో మాజీ మంత్రి అయినటువంటి మల్లా రెడ్డి కి విలన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది అని , కానీ ఆయన ఆఫర్ ను రిజెక్ట్ చేశాడు అని అనేక వార్తలు చాలా రోజుల క్రితం వచ్చాయి. గతంలోనే మల్లా రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వచ్చింది అని దానిని వదులుకున్నాను అని చెప్పాడు. తాజాగా మల్లా రెడ్డి తన కుటుంబంతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ సినిమాలో వచ్చిన ఆఫర్ గురించి ... దానిని ఎందుకు రిజెక్ట్ చేశాను అనే దాని గురించి మల్లా రెడ్డి ఫుల్ గా క్లారిటీ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మల్లా రెడ్డి మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో నన్ను విలన్ గా నటించాలి అని ఆ మూవీ దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ నన్ను కోరారు.

కానీ విలన్ పాత్ర కావడంతో నేను వద్దన్నాను. కానీ హరీష్ శంకర్ నన్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఏకంగా ఆ సినిమాలో నటిస్తే మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్  కూడా ఇస్తాము అని ఆఫర్ చేశారు. కానీ సినిమాలో విలన్ అంటే ఇంటర్వెల్ వరకు నేను హీరోని తిట్టాలి. ఆ తర్వాత హీరో నన్ను తిడతాడు ... కొడతాడు. అందుకే నేను విలన్ పాత్ర చేయను అని అన్నాను అని మల్లా రెడ్డి తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: