
ఇందులో పవిత్ర గౌడ మొదటి నిందితురాలిగా ఉండగా, A 2 గా దర్శన్ ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు కూడా బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నట్లు తెలిసిందే. అభిమానిని హత్య చేసిన కేసులో ఈ ఇద్దరు నిందితులుగా ఉన్నారు. ఈ విషయం పై ఆ బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలంటు నటి రమ్య సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేయగా , దీంతో దర్శన్ అభిమానులు, రమ్యను చాలా దారుణంగా ట్రోల్ చేయడమే కాకుండా అసభ్యకరమైన పదజాలంతో కామెంట్స్ చేయడమే కాకుండా కొంతమంది బెదిరించారు.
ఈ విషయం పైన రమ్య జులై 28న బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఇలాంటి బెదిరింపులు చేసే వారిపైన చర్యలు తీసుకోవాలంటు కోరడంతో 43 మంది సోషల్ మీడియా ఖాతాదారుల పైన ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేయగా , 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో హీరో దర్శన్ అభిమానులే అందరూ ఉన్నట్లు విచారణలో తెలియజేశారు. నటి రమ్య స్టేట్మెంట్, నిందితులుగా ఉన్న 12 మంది స్టేట్మెంట్లను చార్జిషీట్లో జత చేసినట్లు అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఈ 12 మందిలో నలుగురు జైలులో ఉన్నారని మిగిలిన వారికి బెయిల్ లభించింది.