
కానీ అలా అని ఆయన సినిమాలు పూర్తిగా మానేశాడనడం కూడా తప్పే. సినిమాలు ఇక చేయను అని కూడా ఆయన ఎక్కడా చెప్పలేదు. “అవసరమైతే మళ్లీ సినిమాల్లోకి వస్తాను” అంటూ కొన్ని కామెంట్లు ఆయన దగ్గర నుంచి వినిపిస్తున్నాయి.దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సినిమాలపై మరోసారి హాట్ చర్చ మొదలైంది. అభిమానులు ఆయన మళ్లీ నటిస్తే, అది ఏ సినిమాలో అయితే ఉండాలి అన్నదానిపై పెద్ద చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ తన మనసు మార్చుకొని, తన కెరీర్‌లో ఓసారి చేసిన ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తీయాలని నిర్ణయిస్తే — థియేటర్లు మొత్తం బ్లాక్ అయిపోవడం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు.
అయితే ఆ సినిమా ఏదో తెలుసా?అది ‘బద్రి’!పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఎప్పటికి ఫ్యాన్స్ ది మోస్ట్ ఫేవరేట్ మూవీ. దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కి, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్టైల్, మేనరిజం, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కొత్త స్థాయిలో ఉండేవి. అమీషా పటేల్ అమాయకత్వం, రేణు దేశాయ్ చిలిపితనం, అందం ఈ సినిమాకు మరింత గ్లామర్ జోడించాయి.ఆ కాలంలో ‘బద్రి’ సినిమా యువతలో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ఆ సినిమా ద్వారా మాత్రమే కాకుండా, తన ప్రత్యేకమైన యాటిట్యూడ్ తో ఒక కొత్త తరహా స్టార్ ఇమేజ్ ని సృష్టించుకున్నాడు. అందుకే అభిమానులు ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ వస్తే అది చరిత్ర సృష్టించేలా ఉండబోతోందని నమ్ముతున్నారు.
కొంతమంది ఫ్యాన్స్ అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి, “పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉన్నా పరవాలేదు. ఆయన కొడుకు అఖీరా నందన్ ఈ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది” అని సోషల్ మీడియాలో సజెస్ట్ చేస్తున్నారు. ఇలా అయితే అది పవన్ కళ్యాణ్ లెగసీకి నెక్స్ట్ చాప్టర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు పవన్ కళ్యాణ్ వైపే ఉంది — ఆయన నిజంగా ఈ సజెషన్ పట్ల స్పందిస్తారా? ‘బద్రి 2’ లాంటి సీక్వెల్ ఐడియాను సీరియస్‌గా తీసుకుంటారా? అనే ప్రశ్నలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన నిర్ణయాలతో సర్‌ప్రైజ్ చేసే వ్యక్తి కాబట్టి, ఆయన మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెడితే, అది ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే మాస్ రీ-ఎంట్రీ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.మరి ఈ “బద్రి సీక్వెల్” కల నిజమవుతుందా లేదా అనేది వచ్చే రోజుల్లో తేలాల్సిందే!