తెలుగు రియాలిటీ షోలో బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7న మొదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ షో నిర్వహికులకు ఒక షాక్ తగులుతోంది. అదేమిటంటే బిగ్ బాస్ షో ఆపివేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలువురు యువకులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హౌస్ లో అశ్లీలత ప్రోత్సహిస్తూ యువతను తప్పుదావ పట్టిస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తూ సిద్ధపేట జిల్లా యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


తెలుగు బిగ్ బాస్ షో సమాజాన్ని  తప్పుదావ పట్టించేలా ఉన్నదంటూ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదంటూ ,కుటుంబ విలువలు పాటించని వారిని కూడా బిగ్ బాస్ టీమ్ ఎందుకు ఎంచుకున్నదంటూ ఫైర్ అవుతున్నారు. సమాజం సిగ్గుపడే విధంగా ఈ షో నిర్వహిస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు. వెంటనే ఈ షోని ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బాస్ షో పైన కూడా తెలంగాణ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మహిళా సంఘాలతో, ప్రజాసంఘాలతో బిగ్ బాస్ హౌస్ ని ముట్టడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు


కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ కూడా బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలంటూ హెచ్చరిస్తున్నారు. నాగార్జున వంటి హీరోలు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని వెల్లడిస్తున్నారు. రీతు చౌదరి, దివ్వెల మాధురి వంటి వారిని సెలెక్ట్ చేసుకుని బిగ్ బాస్ యాజమాన్యం యువతకి ,సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అంటు ప్రశ్నిస్తున్నారు?. గడిచిన కొద్ది రోజుల క్రితం కన్నడ బిగ్ బాస్ షో ను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు కారణం జూలీవుడ్ స్టూడియో నుంచి ప్రతిరోజు 2.5 లక్షల శుద్ధి చేయని నీటిని బయటికి వస్తోందంటూ ఆరోపణలు రావడంతో దీనిపైన అక్కడి ప్రభుత్వం బిగ్బాస్ నిర్వాహకుల పైన చర్యలు తీసుకొని హౌస్ కి తాళాలు వేశారు. దీంతో ఈ రియాల్టీ షోలో పాల్గొన్న 17 మంది గిల్టన్ రీస్టార్ట్ లో ఉంచి, క్లియర్ చేసిన తర్వాత  బిగ్బాస్ షో తిరిగి ప్రారంభమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: